కోదాడ : పట్టణంలో పారిశుద్ధ్య ( Sanitation ) నివారణకే తొలి ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ( Kusuma Venkataratnam Babu) పేర్కొన్నారు ఆదివారం కోదాడ పట్టణంలోని పాత మున్సిపాలిటీ నుంచి దోమల మందు పిచికారి కార్యక్రమాన్ని ప్రారంభించారు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చేందుకు పారిశుద్ధ్య నివారణతో పాటు దోమలు బెడదను నివారించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రజల సహకరించాలని ఇళ్లలోని చెత్తను వీధుల్లో వేయకుండా చెత్త బండిలోనే వేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు గుండపనేని పద్మావతి , కందుల కోటేశ్వరరావు, తోట జ్యోతి, కట్టబోయిన జ్యోతి, పలువురు కౌన్సిలర్లు ,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.