రాజన్న సిరిసిల్ల : కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో ఏదో ఒక చోట ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ధాన్యం కొనుగోలు చేయాలని సిరిసిల్లా జిల్లా (Siricilla district)ఎల్లారెడ్డిపేట మండలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రోడ్డుపై ధాన్యం పోసి ఆందోళన(Farmers concern) చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..ధాన్యం కొనుగోలు చేయక కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని, ఇప్పటికే సగానికి పైగా ధాన్యం దళారులకు అమ్ముకున్నామని రైతులు తెలిపారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రైతులు హెచ్చరించారు. కాగా, రైతుల ఆందోళనతో సిరిసిల్ల- కామారెడ్డి ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.