కొలంబో : శ్రీలంక, ఆఫ్ఘానిస్థాన్ మధ్య దుబాయ్ ఆతిథ్యమివ్వాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్లను వాయిదా వేస్తున్నట్టు ఇరుజట్ల బోర్డులు ప్రకటించాయి. మధ్య ఆసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సిరీస్ను వాయిదా వేస్తున్నట్టు తెలిపాయి. లంక.. ఆఫ్ఘాన్ పర్యటనలో (దుబాయ్లో మ్యాచ్లు) భాగంగా ఈనెల 13,15, 17న మూడు టీ20లు, మార్చి 20, 22, 25న మూడు వన్డేలు ఆడాల్సి ఉంది.
కానీ ఇరాన్ యుద్ధం కారణంగా ఈ సిరీస్ను నిర్వహించలేమని ఆ దేశం తేల్చి చెప్పడంతో వాయిదా వేయకతప్పలేదు. ఇదిలాఉండగా ఈనెల 25న దోహాలో జరగాల్సిన ఐసీసీ బోర్డు, కమిటీ మీటింగ్ కూడా రైద్దెంది.