న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత అంతకంతకూ (Air Pollution) పడిపోతున్నది. కాలుష్యం రోజురోజుకు పెరుగుతుండటంతో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించిపోయింది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు బురారీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 385 పాయింట్లుగా నమోదయింది. గాలి కాలుష్యానికి తోడు ఢిల్లీ అంతటా దట్టమైన పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. విషవాయువును పీల్చుకుంటున్న ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాగా, దేశ రాజధానిలో దీపావళి రాత్రి అధిక స్థాయిలో వాయు కాలుష్యం నమోదైంది. పలు ప్రాంతాల్లో ఏక్యూఐ రీడింగ్‌లు గరిష్ఠ సాయి 999కి చేరాయి. ఏక్యూఐ 507 పాయింట్లకు చేరితే ప్రమాదకర స్థాయి కాలుష్యంగా పరిగణిస్తారు. ఈ గాలి పీల్చితే ప్రజలకు శ్వాసకోశ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
#WATCH | Delhi: A thin layer of smog witnessed in the Burari as the AQI in the area stands at 385, categorised as ‘Very Poor’, as per the Central Pollution Control Board (CPCB). pic.twitter.com/77tIFpFTr1
— ANI (@ANI) November 3, 2024
ఆగ్రా, నోయిడాతోపాటు ఢిల్లీ ఎన్సీఆర్లో దట్టంగా పొగ కమ్ముకున్నది. కాలుష్యం ధాటికి తాజ్‌మహల్ కనిపించకుండా పోయింది. గత 10 నుంచి 12 రోజుల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని దీపక్‌కుమార్ అనే స్థానికుడు వెల్లడించారు. ఇక యమునా నది నురగలు కక్కుతున్నది. పెద్దమొత్తంలో నురగ నదిపై ప్రవహిస్తున్నది.
#WATCH | Delhi: Toxic foam seen floating on the Yamuna River in Kalindi Kunj, as pollution level in the river continues to remain high.
(Drone visuals shot at 8:00 am) pic.twitter.com/zFUsmqDpHa
— ANI (@ANI) November 3, 2024
#WATCH | Delhi: Toxic foam seen floating on the Yamuna River in Kalindi Kunj, as pollution level in the river continues to remain high.
(Drone visuals shot at 8:00 am) pic.twitter.com/SP2cJmZctF
— ANI (@ANI) November 3, 2024
గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు. అయితే, గత కొంతకాలంగా ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకరంగా మారుతోన్న విషయం తెలిసిందే. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలపెట్టడానికి తోడు.. మంచు రాజధానిని కమ్మేయడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. కాలుష్య నియంత్రణకు పాలకులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఉండటం లేదు. రోజురోజుకూ గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఈ కారణంగా నగర వాసులు తీవ్ర అనారోగ్య సమసల్యకు గురికావాల్సి వస్తోంది.
#WATCH | Uttar Pradesh | Taj Mahal in Agra is engulfed in a layer of haze today
“It’s been hazy as the winter is about to arrive and the weather has changed in the last 10-12 days,” said Deepak Kumar, a local resident. pic.twitter.com/V9qTlo3LRE
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 3, 2024