మెదక్ : తన పొలాన్ని అటవీశాఖ అధికారులు లాక్కుంటున్నారని ఆరోపిస్తూ ఓ రైతు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి(Farmer suicide attempt )పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా (Medak district)కౌడిపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన రైతు బర్మావత్ శ్రీను అటవీశాఖ కార్యాలయం(Forest department office) వద్ద ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన భూమికి పట్టా ఉందని చెప్పినా వినకుండా అధికారులు లాక్కునే ప్రయత్నం చేయడంతో మనస్థాపం చెంది బలవన్మరణానకి పాల్పడ్డాడు. గమనించిన అటవీ శాఖ అధికారులు, పోలీసులు శ్రీను అడ్డుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
KTR | అన్ని రంగాల్లో వైఫల్యం.. అన్ని వర్గాల్లో ఆగ్రహం..! కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్