KTR | హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. పార్టీ ఫిరాయింపులు అప్రజాస్వామికమని, కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
మీ సొంత పార్టీ నేతనే.. మీరు చేసిన ఎమ్మెల్యేల ఫిరాయింపులు అప్రజాస్వామికమని, దుర్మార్గమైన చర్య అని సూటిగా వేలెత్తి చూపుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికైనా మీరు లెంపలేసుకుంటారా..? జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడే.. ఇది కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం అని.. మీ దిగజారుడు రాజకీయాలపై దుమ్మెత్తి పోశారని కేటీఆర్ తెలిపారు.
ఇప్పటికైనా మీరు చేసిన తప్పును ఒప్పుకుంటారా..? క్షమాపణ చెబుతారా..? మీరు గడప గడపకు వెళ్లి చేర్చుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చట్టప్రకారం వేటు వేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇప్పటికైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఉంటాయా..? ఇప్పుడు రాయితో కొట్టాల్సింది ఎవరిని..? ఫిరాయించిన ఎమ్మెల్యేలనా..? ప్రోత్సహించిన మిమ్ములనా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
రేవంత్ గారు..
మీ సొంత పార్టీ నేతనే..
మీరు చేసిన ఎమ్మెల్యేల ఫిరాయింపులు
అప్రజాస్వామికమని, దుర్మార్గమైన చర్య అని సూటిగా వేలెత్తి చూపుతున్నారు..ఇప్పటికైనా మీరు లెంపలేసుకుంటారా ?
జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడే..
ఇది కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం అని….మీ దిగజారుడు… pic.twitter.com/D9CTnAl6Ci— KTR (@KTRBRS) October 23, 2024
ఇవి కూడా చదవండి..
KTR | అన్ని రంగాల్లో వైఫల్యం.. అన్ని వర్గాల్లో ఆగ్రహం..! కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
AEOs | సస్పెండ్ చేసిన ఏఈవోలు తిరిగి విధుల్లోకి..! వ్యవసాయ శాఖ డైరెక్టర్‌తో చర్చలు