కాజీపేటను రైల్వే డివిజన్‌గా మార్చాలి
కాజీపేట జంక్షన్‌ను రైల్వే డివిజన్‌గా మార్చాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాత్సవను బీఆర్ఎస్ బృందం కోరింది. సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో పాటు పార్టీ నాయకులు జీఎం తో భేటీ అయ్యారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, భూ నిర్వాసితులు, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, రైల్వే డివిజన్ మంజూరు తదితర అంశాలపై వినతి పత్రం అందజేశారు.
- భూ నిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలి
- స్థానికులకు 70 శాతం అవకాశం కల్పించాలి
- దక్షిణమధ్య రైల్వే జీఎంతో భేటీలో బీఆర్ఎస్ బృందం
హనుమకొండ, మార్చి 9 : కాజీపేట జంక్షన్‌ను రైల్వే డివిజన్‌గా మార్చాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాత్సవను బీఆర్ఎస్ బృందం కోరింది. సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో పాటు పార్టీ నాయకులు జీఎం తో భేటీ అయ్యారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, భూ నిర్వాసితులు, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, రైల్వే డివిజన్ మంజూరు తదితర అంశాలపై వినతి పత్రం అందజేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మా జీ ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని గత 40 ఏండ్లుగా ఓరుగల్లు ప్రజలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఓరుగల్లు ప్రజల చిరకాల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ప్రకటన చేసిందని, పదేళ్ల క్రితమే వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం ప్రకటన చేయడంతో బీఆర్ఎస్ స్థానిక నాయకులు అయోధ్యపురం రైతులను ఒప్పించి భూములు సేకరించారని చెప్పారు. చాలామంది రైతులు తకువ ధరకు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారని పేరొన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాకుండా మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు కేంద్రం ఒప్పుకున్నదని, పనులను ప్రైవే ట్ సంస్థలు నిర్వహిస్తున్నట్లు జీఎం చెప్పారని వినోద్‌కుమార్ వెల్లడించారు.
అరూరి మాట్లాడుతూ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం అయోధ్యపురం ప్రాంతంలో భూములు కోల్పోయిన రైతులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. మాజీ ఎంపీ వినోద్‌కుమార్ విద్యార్థి దశ నుంచే ఈ కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాటం చేశారన్నారు. మహారాష్ట్రలోని లాతూర్‌లో స్థానికులకు ఎలా ఉద్యోగాలు కల్పించారో, అలాగే కాజీపేటలో కూడా భూములు కోల్పోయిన వారికి, స్థానికులకు 70 శాతం ఉద్యోగాలివ్వాలని రైల్వే అధికారులను కోరినట్లు అరూరి తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్ సంకు నర్సింగరావు, నాయకులు నార్లగిరి రమేశ్, దువ్వ కనకరాజు, కొండ్ర శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

