KTR | అన్ని రంగాల్లో వైఫల్యం.. అన్ని వర్గాల్లో ఆగ్రహం..! కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. అన్ని వర్గాల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుందన్నారు. సకల జనులను ఈ కాంగ్రెస్ సర్కార్ దగా చేసిందని ధ్వజమెత్తారు.
KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. అన్ని వర్గాల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుందన్నారు. సకల జనులను ఈ కాంగ్రెస్ సర్కార్ దగా చేసిందని ధ్వజమెత్తారు. ఉద్యోగులు.. నిరుద్యోగులు.. విద్యార్థులు.. రైతులు.. కార్మికులు.. మహిళలు సమాజంలోని ప్రతి సెక్షన్ ఆందోళన బాటలోనే ఉన్నారని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఐదు డీఏలు పెండింగ్లో ఉంచడం ఏంటి..? ఇంత అన్యాయం ఎప్పుడైనా ఉందా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. కనీసం కలిసి మాట్లాడటానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఉద్యోగ సంఘాలను అవమానించడం భావ్యమా..? విన్నపాలు వినే తీరికకూడా లేదా ఈ ముఖ్యమంత్రికి..? అని నిలదీశారు.
కొత్త పీఆర్సీ వేసి ఆరు నెలల్లోనే సిఫారసులు అమలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది వాస్తవం కాదా..? 11 నెలలు గడిచినా రెండో పీఆర్సీ నివేదికను ఎందుకు తెప్పించుకోలేదు..? సీపీఎస్ రద్దు చేసి.. ఓల్డ్ పెన్షన్ స్కీం తిరిగి తెస్తామని మాటిచ్చి.. ఇప్పుడు బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటే ఎట్లా..? తెలంగాణ ఉద్యమంలో.. స్వరాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక పోషించిన ఉద్యోగ వర్గాల సమస్యలను పట్టించుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి నిదర్శనం..! అని కేటీఆర్ మండిపడ్డారు.
నెలల తరబడి జీతాల్లేక చిరుద్యోగులు… కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది అల్లాడిపోతున్నారు..! ఆశాలు.. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలకు దిక్కుమొక్కు లేదు..! ఏఈవోల పనిభారం బాధ.. ఆవేదన వినకుండా వందల మందిని ఏకపక్షంగా సస్పెండ్ చేయడం దుర్మార్గం..! ఉద్యోగుల మీద కక్ష కట్టడం మంచిది కాదు.. వాళ్ల సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టండి..! అని కేటీఆర్ తెలిపారు.
అన్ని రంగాల్లో వైఫల్యం..అన్ని వర్గాల్లో ఆగ్రహం!
సకల జనులను దగా చేసింది కాంగ్రెస్ సర్కారు!
ఉద్యోగులు..నిరుద్యోగులు..విద్యార్థులు..రైతులు..కార్మికులు..మహిళలు సమాజంలోని ప్రతి సెక్షన్ ఆందోళన బాటలోనే వున్నారు!
ఐదు డీఏలు పెండింగ్లో వుంచడం ఏంటి..ఇంత అన్యాయం ఎప్పుడైనా వుందా?
కనీసం… pic.twitter.com/XVCiiDCmN6
— KTR (@KTRBRS) October 23, 2024
ఇవి కూడా చదవండి..
KTR | కేంద్రమంత్రి బండి సంజయ్కి కేటీఆర్ లీగల్ నోటీసులు
KTR | రైతును రాజు చేసింది కేసీఆరే : కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

