KTR | హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో దండగన్న వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో పండుగలా చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. అప్పుల బాధ నుంచి విముక్తి కల్పించి, ఆత్మహత్యలకు తావివ్వకుండా అన్నదాతను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. రైతును రాజు చేసింది కేసీఆరే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
స్వరాష్ట్రం ఏర్పడ్డప్పుడు బియ్యం పండించడంలో తొలి పది స్థానాల్లో కూడా లేని తెలంగాణ ఇప్పుడు నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణం అని కేటీఆర్ తెలిపారు. నెర్రెలు బారిన ఈ నేల పచ్చబడింది, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో మరే రాష్ట్రమూ సాధించని అరుదైన రికార్డు సాధించి, దేశానికి అన్నంపెట్టే ధాన్యాగారంగా ఎదిగిందీ అంటే దానికి కారణం రైతుబిడ్డగా కేసీఆర్ దార్శనికత, కార్యాచరణ అని కేటీఆర్ పేర్కొన్నారు.
భూగోళం మీద అత్యధిక జనాభా కలిగిన దేశంగా మన ఆహారాన్ని మనమే పండించుకోవాలి కానీ ఇంకెవరూ మనకు ఆహారం సమకూర్చలేరు అని కేసీఆర్ గారు తరచూ చెప్తారని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం కట్టి, రైతుబంధు పెట్టుబడి సాయం అందించి, 24 గంటల ఉచిత కరెంటు, పండిన ధాన్యం కొనుగోలు చేసి, కొత్త గోదాములు, రైతు వేదికలు కట్టి.. ఇలా ఎన్నో పథకాలు రైతులకు తీసుకొచ్చి.. రైతును రాజును చేసిండు కేసీఆర్ అని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఆ విషయంలో ధనవంతులు.. బడాబాబులకు మినహాయింపు ఉంటుందేమో..: కేటీఆర్
KTR | అదానీ ఫ్యాక్టరీపై ముందుకెళ్తే.. ప్రజలే కాంగ్రెస్ సర్కారుకు మరణశాసనం రాస్తారు: కేటీఆర్
KTR | రేవంత్ దృష్టిలో మోదీ, అదనీ అంటేనే అబుల్ ఇంజిన్: కేటీఆర్