హైదరాబాద్: రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోదీ, అదానీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. అందుకే వాళ్లిద్దరికీ కావాల్సిన పనులను చక్కబెడుతూ వారి చల్లని చూపు తనపై ఉండేలా చూసుకుంటున్నారని ఫైరయ్యారు. ప్రధాని ఆదేశానుసారమే రేవంత్ నడుచుకుంటున్నారని చెప్పారు. బడేభాయ్ ఆజ్ఞలను సీఎం తూచా తప్పకుండా పాటిస్తున్నారని, అదాని సంతృప్తి కోసం ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు. అదానికి మేలు చేసేలా రేవంత్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నదని మండిపడ్డారు. అందుకే సీఎం చేసే దుర్మార్గాలపై బీజేపీ మౌనంగా ఉంటుందంటూ ఎక్స్ వేదికగా ఫైరయ్యారు.
‘రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజన్ అంటే = మోదీ + అదానీ. అందుకే వాళ్లిద్దరికీ కావాల్సివన పనులను చక్కబెడుతూ వారి చల్లని చూపు తనపై ఉండేలా చూసుకుంటున్నారు. మూసీ పుట్టిన ప్రాంతం దామగుండం వద్ద 12 లక్షల చెట్లను నరికేందుకు చర్యలు తీసుకున్నారు. 2900 ఎకరాల అటవీ భూమిని మోదీ ఆదేశాలనుసారం ఆయనకు అప్పగించారు. మూసీ పుట్టే ప్రాంతం నాశనమైనా సరే తన బడేభాయ్ ఆజ్ఞను మాత్రం పాటిస్తున్నారు. ఇటు మూసీ దిగువన రామన్నపేటలో అంబుజా సిమెంట్ ప్లాంట్ కోసం బూటకపు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం ద్వారా అదానిని సంతృప్తి పరుస్తున్నారు.
నిజానికి ఈ భూమిని తెలంగాణలో డ్రై పోర్ట్ కోసం కేటాయించటం జరిగింది. కానీ మోదీ, అదానీ కోసం ఈ ప్రభుత్వం ఇష్టానుసారంగా అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం పనిచేస్తున్నది. దీనికి ప్రతిఫలంగా రూ.లక్షా 50 వేల కోట్లతో మూసీ ప్రాజెక్ట్ సహా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసే అన్ని దుర్మార్గాలు, అవినీతిపై బీజేపీ మౌనంగా ఉంటుంది’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Double engine = Modi + Adani
(as per Revant Reddy). So how does he manage this Double Engine?✳️ Bow down to the diktats of Modi Ji by handing over 2900 Acres at Damagundam even if it means chopping down 12 lakh trees and destroying Musi at its origin
✳️ Satisfy Adani Ji by…
— KTR (@KTRBRS) October 23, 2024