BORDER 2 OTT | బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన భారీ యుద్ధ చిత్రం ‘బోర్డర్ 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను సాధించి ప్రస్తుతం ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. 1997లో వచ్చిన క్లాసిక్ వార్ డ్రామా ‘బోర్డర్’కు సీక్వెల్‌గా, అనురాగ్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరి 23న థియేటర్లలో విడుదలై సుమారు రూ. 480 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ భారీ విజయం తర్వాత, ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మార్చి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 1971 భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సన్నీ డియోల్‌తో పాటు వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్, అహాన్ శెట్టి కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.