KTR | ఆ విషయంలో ధనవంతులు.. బడాబాబులకు మినహాయింపు ఉంటుందేమో..: కేటీఆర్
కాంగ్రెస్ సర్కార్, హైడ్రా తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. హైడ్రా తీసుకునే చర్యలు పేదలు, మధ్యతరగతికే వర్తిస్తాయా అని ప్రశ్నించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్, హైడ్రా తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. హైడ్రా తీసుకునే చర్యలు పేదలు, మధ్యతరగతికే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్, హెచ్ఎఫ్ఎల్.. పేదలు, మధ్యతరగతి వర్గాలకే పరిమితామా అని నిలదిశారు. ధనవంతులు, బడాబాబులకు మినహాయింపు ఉంటుందేమోనని ఎక్స్‌వేదికగా విమర్శించారు.
మూసీ సుందరీకరణ పేరుతో రివర్‌బెడ్‌లో ఉన్న ఇండ్లను ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే నార్సింగి ప్రాంతంలో ఆదిత్య బిల్డర్స్ సంస్థ మూసి నదిలో నిర్మాణాలను చేపడుతున్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎక్స్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పేరుతో పేద, మధ్య తరగతి ప్రజలు జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బడా నంస్థల నిర్మాణాల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. దానిని కేటీఆర్ రీట్వీట్ చేస్తూ ధనవంతులు, పెద్దవాళ్లకు మినహాయింపు ఉంటుందేమోనంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
I guess FTL/HFL, Buffer zone, HYDRA scare tactics & rules strictly apply only to the poor & middle class people
Rich & mighty can get away with anything 👏
Selective justice & enforcement https://t.co/IpRfRPV11p
— KTR (@KTRBRS) October 23, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

