హైదరాబాద్ : సస్పెండ్ చేసిన 163 మంది ఏఈవోలను(AEOs) తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. డిజిటల్ క్రాప్ సర్వే చేయాలని ఏఈవోలకు ప్రభుత్వం సూచింది. డిజిటల్ క్రాప్ సర్వేలో(Digital Crop Survey) అనేక సమస్యలున్నందున, వాటిని పరిష్కరించిన తర్వాతే సర్వే చేస్తామని ఏఈవోలు తేల్చి చెప్పినట్లు తెలిసింది. ముందుగా సర్వే ప్రారంభించండి.. ఒక్కొక్కటిగా సమస్యల పరిష్కారానికి మరోసారి చర్చలు జరుపుతామని ప్రభుత్వం హామీనిచ్చినట్లు సమాచారం.
కాగా, డిజిటల్ క్రాప్ సర్వే చేయని వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో)పై వ్యవసాయ శాఖ కక్షసాధింపు చర్యలకు దిగింది. తమ మాట వినడంలేదనే కోపంతో రైతుబీమాలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణం చూపుతూ తాత్కాలికంగా విధుల నుంచి తొలగించింది. మంగళవారం ఒక్కరోజే 165 మంది ఏఈవోలను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం నుంచి మొదలైన సస్పెన్షన్ల పరంపర సాయంత్రం వరకు కొనసాగింది. జిల్లాకు కనీసం 5-10 మం దిని సస్పెండ్ చేసినట్టుగా తెలిసింది.
బ్రేకింగ్
వ్యవసాయ శాఖ డైరెక్టర్‌తో ఏఈవోల చర్చలు
సస్పెండ్ చేసిన 163 మంది ఏఈవోలను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు అంగీకారం
డిజిటల్ క్రాప్ సర్వే చేయాలని ఏఈవోలకు ప్రభుత్వ సూచన
డిజిటల్ క్రాప్ సర్వేలో అనేక సమస్యలున్నందున, వాటిని పరిష్కరించిన తర్వాతే సర్వే చేస్తామని తేల్చి చెప్పిన… https://t.co/VyBcgclPic pic.twitter.com/wsjDobLUnB
— Telugu Scribe (@TeluguScribe) October 23, 2024