e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home News Farmer loan waiver |త్వరలోనే లక్షలోపు రైతు రుణమాఫీ : మంత్రి హరీశ్‌రావు

Farmer loan waiver |త్వరలోనే లక్షలోపు రైతు రుణమాఫీ : మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట : రైతు రుణమాఫీలో భాగంగా రూ.50వేల నుంచి లక్ష లోపు రుణాలు కలిగి ఉన్న రైతుల ఖాతాల్లోకి వడ్డీతో సహా జమచేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఇప్పటికే రూ.50వేల లోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తికావొస్తున్నదన్నారు. లక్ష లోపు రుణమాఫీకి సంబంధించి వచ్చే మార్చి బడ్జెట్‌లో నిధుల కేటాయింపు చేసేలా సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణ శివారులోని కిషన్‌నగర్‌ వద్ద డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణానికి జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీని సంపూర్ణంగా నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.

- Advertisement -

అలాగే సొంత నివేశనా స్థలం కలిగి ఉన్న నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందని, ఇందుకు సంబంధించి రూ.10వేల కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు.

మెట్ట ప్రాంత వరప్రదాయినీ గౌరవెల్లి రిజర్వాయర్‌ మిగులు పనులను పూర్తి చేసేందుకు రూ.58కోట్లు మంజూరు చేశామన్నారు. జర్నలిస్టుల సంక్షేమంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని, ఇందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.42కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారన్నారు.

కరోనా కష్టకాలంలో వైద్యులు, పోలీసులతో పాటు జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి పని చేశారన్నారు. కరోనా సోకిన జర్నలిస్టులకు ప్రెస్‌ అకాడమీ ద్వారా రూ.20వేలు, మృతి చెందిన జర్నలిస్టులకు రూ.2లక్షలు ప్రభుత్వం ఇస్తున్నట్లు చెప్పారు. మృతి చెందిన జర్నలిస్టు కుటుంబానికి మూడేండ్ల పాటు రూ.3వేల చొప్పున పింఛన్‌ ఇస్తున్నదని తెలిపారు.

దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధిక అక్రిడిటేషన్లు ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ రాయిరెడ్డి రాజిరెడ్డి, ఆర్డీవో జయచంద్రారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజితావెంకట్‌ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

చైత్రను హతమార్చిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి

కొవిడ్‌-19 : భార‌త్‌లో ఆ వేరియంట్లను గుర్తించ‌లేదు

Priyanka Vadra : అసెంబ్లీ బరిలోకి ప్రియాంకగాంధీ వాద్రా!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana