దిలావర్పూర్, జనవరి 9 : నిర్మల్(Nirmal )జిల్లా దిలావర్పూర్ మండలంలోని సాంగ్వీ గ్రామానికి చెందిన రైతు పంతులు భూమన్న(69) విద్యుత్ షాక్‌తో(Electric shock) చేనులోనే మృత్యువాత పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మాయాపూర్ గ్రామ శివారులో బుధవారం రాత్రి తనకున్న చేనుకు నీరు పెట్టడానికి వెళ్లాడు. బోరు మోటారు స్విచ్ ఆన్ చేస్తుండగా షాక్ తగిలి మృత్యువాత పడ్డాడు. భూమన్న ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చేను వద్దకు వెళ్లారు. చేనులోనే నిర్జీవంగా పడి ఉండడాన్ని గమనించారు. భూమన్న భార్య ఆడేల్లు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపాడు. కాగా.. భూమన్న కుమారుడు మూడేండ్ల క్రితం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | నాలుగైదు ప్రశ్నలను నలభై రకాలుగా అడిగారు.. ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్
Revanth Reddy | జులై 6 లోగా పాస్‌పోర్టు తిరిగి అప్పగించండి.. సీఎం రేవంత్‌కు ఏసీబీ కోర్టు ఆదేశం
RS Praveen Kumar | కేటీఆర్ గారూ.. సత్యం మీ వైపే ఉంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్