Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. తన ఎత్తుపై పరుష పదజాలంతో మాట్లాడిన రేవంత్‌పై హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. నేను తాటి చెట్టంతా ఎదిగాను.. నీవు వెంపలి చెట్టంతా కూడా ఎదగలేదు కదా..? అని రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు చురకలంటించారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ప్రజలు రెండు రకాల వరదలతో ఇబ్బంది పడుతున్నారు. ఒకటి ప్రకృతి వైపరీత్యం కారణంగా అకాల వర్షాలతో వచ్చిన వరదలు, రెండోది ముఖ్యమంత్రిగారి అబద్దాల వరద. ప్రకృతి వైపరీత్యాలతో వచ్చిన బురదను కడుక్కోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి అబద్ధాలు మాత్రం మోరీలా కంపును మించి పోయాయి. ఇవాళ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు.
మొన్న రేవంత్ రెడ్డి ఎక్కడో మాట్లాడుతూ.. నాకు కాకున్నా నా కుర్చీకి అయినా మర్యాద ఇవ్వండంటూ ఏడ్చినంత పని చేసిండు. మరి ఆ మర్యాద దక్కాలంటే మర్యాదగా వ్యవహరించాలి. భాష, వ్యవహర శైలి, నడవడిక మర్యాదగా ఉండాలి. అప్పుడు మార్యాద లభిస్తుంది. నోరు తెరిస్తే బూతులు, అబద్దాలు మాట్లాడితే మర్యాద ఎలా వస్తది. గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్ష బాధ్యతు చేపట్టే సందర్భంగా ఎన్నో అబద్దాలు మాట్లాడారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
నా గురించి ఏం మాట్లాడారో చూశారు మీరంతా. తాటిచెట్టంతా పెరిగావు.. దూడకున్నంత మెదడు లేదంటు.. సన్నాసి.. ఏడా దాక్కున్నావు అని నన్ను ఉద్దేశించి మాట్లాడిండు. కానీ నాకు అలా మాట్లాడానికి మర్యాద, సంస్కారం అడ్డు వస్తున్నాయి. నీవు లిల్లీఫూట్ అంత లేవు అని అనలేనా..? నేను నిన్ను సన్నాసి అనడం పెద్ద క్టమైనా పనా..? నా ఎత్తు గురించి దుర్భషలాడుతున్నావు. నా ఎత్తు మీద నీకు అంత ఈర్ష్య ఎందుకు..? దేవుడు ఇచ్చిన సృష్టి. అది భగవంతుడు ఇచ్చిన వరం. నా ఎత్తు మీద ఎందుకు అసూయపడుతున్నావు. ఎంత తిట్టినా.. ఎంత మాట్లాడినా నా అంత ఎత్తు పెరగలేవు. ఆ స్టేజీ దాటిపోయింది. నా ఎత్తు గురించి మాట్లాడం మానేసి.. రైతుల గురించి ఆలోచించండి. నేను పొడుగే.. తెలంగాణ ఉద్యమం మరింత పొడుగు చేసింది. కానీ నువ్వేంది.. నీ బుద్ది కురచ, నీ చరిత్ర కురచ, నీ భాష కురచ.. నీ కురచతనం వల్ల నా పొడుగు గురించి మాట్లాడి నీ విలువ తగ్గించుకుంటున్నావ్. రాష్ట్రం, ప్రజల గురించి ఆలోచించు. నేను తాటి చెట్టంతా ఎదిగినా.. అందులో తప్పేముంది.. నీవు వెంపలి చెట్టంతా కూడా ఎదగలేదు కదా..? నీకు దేవుడు అంతే ఇచ్చిండు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజలకు మేలు చేయడం గురించి మాట్లాడు అని రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
KTR | కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో.. అన్ని అడ్డగోలు హామీలు, కల్లబొల్లి మాటలు..! కేటీఆర్ ఫైర్
KTR | ప్రజాస్వామ్యం జవాబుదారీతనంతోనే వర్ధిల్లుతుంది.. దౌర్జన్యంతో కాదు: కేటీఆర్