KTR | హైదరాబాద్ : కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. లీటర్ పాలపై రూ. 5 పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరలో మూడు సార్లు పాల ధర పెంచిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఇక హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఏకంగా గంజాయి అమ్మడానికి పర్మిషన్ కావాలని అర్జీ పెట్టుకుందని తెలిపారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు, ఆరు గ్యారెంటీలు అనే డ్రామాలతో రోజులు గడుపుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అన్ని అడ్డగోలు హామీలు, కల్లబొల్లి మాటలే అని ఆయన ధ్వజమెత్తారు.
ఏడాదిన్నరలో మూడుసార్లు పాల ధర పెంచింది కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం! ఏకంగా గంజాయి అమ్మడానికి పర్మిషన్ కావాలని అర్జీ పెట్టుకుంది హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం!
వంద రోజులు, ఆరు గ్యారెంటీలు అని డ్రామాలతో రోజులు గడుపుతున్న తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం! అన్ని… pic.twitter.com/vIvQi4iErg
— KTR (@KTRBRS) September 15, 2024
ఇవి కూడా చదవండి..
KTR | కాంగ్రెస్ రాగానే.. పదేండ్లు పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చు మొదలైంది: కేటీఆర్
KTR | ప్రజాస్వామ్యం జవాబుదారీతనంతోనే వర్ధిల్లుతుంది.. దౌర్జన్యంతో కాదు: కేటీఆర్