హైదరాబాద్: ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొడవ పడితే కాంగ్రెస్‌కు ఏం సంబంధమన్న మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. సిగ్గులేకుండా నీతిమాలిన రాజయం ఎందుకు చేస్తున్నారనంటూ ప్రశ్నించారు. మీ చిట్టినాయుడు కూడా ఇంకా టీడీపీలోనే ఉన్నాడా అని నిలదీశారు. అతి తెలివి మంత్రి గారంటూ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. అసలు చేర్చుకోవడం ఎందుకు, ఆ తర్వాత పదవులు పోతాయన్న భయంతో ఈ నాటకాలు ఎందుకని ప్రశ్నించారు. మీరు ప్రలోభపెట్టి చేర్చుకున్న వాళ్లను మా వాళ్లని చెప్పుకోలేని మీ బాధను చూస్తే జాలి కలుగుతోందని చెప్పారు. మీ అతితెలివితో హైకోర్టును మోసం చేద్దాం అనుకుంటున్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వెల్లడించారు.
‘అతి తెలివి మంత్రి గారు.
మీ లాజిక్ ప్రకారం మీ చిట్టినాయుడు కూడా ఇంకా టీడీపీ లోనే ఉన్నాడా లేక కాంగ్రెస్ లో ఉన్నాడా ?
సరే మీ మాటే నిజం అనుకుందాం ఒక్క నిమిషం కోసం;
మరి మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టు తిరిగి వారికీ కాంగ్రెస్ కండువాలు కప్పిన సన్నాసి ఎవడు?
సిగ్గులేకుండా ఇంత నీతిమాలిన రాజకీయం ఎందుకు ?
అసలు చేర్చుకోవడం ఎందుకు, ఆ తర్వాత పదవులు పోతాయి అన్న భయంతో ఈ నాటకాలు ఎందుకు ? మీరు ప్రలోభపెట్టి చేర్చుకున్న వాళ్ళను మా వాళ్ళు అని చెప్పుకోలేని మీ బాధను చూస్తే జాలి కలుగుతోంది. మీరు మీ అతితెలివితో హైకోర్టు ను మోసం చేద్దాం అనుకుంటున్నారు కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
అతి తెలివి మంత్రి గారు
మీ లాజిక్ ప్రకారం మీ చిట్టినాయుడు కూడా ఇంకా టీడీపీ లోనే ఉన్నాడా లేక కాంగ్రెస్ లో ఉన్నాడా ?
సరే మీ మాటే నిజం అనుకుందాం ఒక్క నిమిషం కోసం;
మరి మా BRS ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టు తిరిగి వారికీ కాంగ్రెస్ కండువాలు కప్పిన సన్నాసి ఎవడు?
సిగ్గులేకుండా ఇంత నీతిమాలిన… pic.twitter.com/CnjrbgxMww
— KTR (@KTRBRS) September 15, 2024
శనివారం జగిత్యాల జిల్లా వెల్గటూరులో పర్యటించిన మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొడవపడితే కాంగ్రెస్ ఏం సంబంధమన్నారు. తమపై నిందలు వేయడం సరికాదని చెప్పారు. ప్రతిదాన్ని రాజకీయం చేసి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
I nominate Minister Sridhar Babu for Best Actor in a supporting role
For Bhaskar Award 👏
Please join me in wishing him success https://t.co/WrNk1P192D
— KTR (@KTRBRS) September 15, 2024