హైదరాబాద్: పదేండ్లు పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చు మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణలో పంటల సాగు విస్తీర్ణం తగ్గడమే దీనికి తొలి ప్రమాద హెచ్చరిక అని చెప్పారు. పంటలసాగులో పంజాబ్ నే తలదన్నే స్థాయికి అనతికాలంలోనే ఎదిగామని ఆనందపడ్డామని, దశాబ్దాలపాటు దగాపడ్డ తెలంగాణ రైతన్న దేశం కడుపునింపే ఎత్తుకు ఎదిగాడని గర్వపడ్డామని చెప్పారు. ఆర్థికంగా చితికిపోయిన అన్నదాతల బతుకులు వ్యవసాయ విప్లవంతో బాగుపడ్డాయని సంబరపడ్డామన్నారు. కానీ.. కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి కౌంట్ డౌన్ షురూ అయిందంటూ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.
పంటలసాగులో పంజాబ్ నే తలదన్నే స్థాయికి అనతికాలంలోనే ఎదిగామని ఆనందపడ్డాం..
దశాబ్దాలపాటు దగాపడ్డ తెలంగాణ రైతన్న దేశం కడుపునింపే ఎత్తుకు ఎదిగాడని గర్వపడ్డాం..
ఆర్థికంగా చితికిపోయిన అన్నదాతల బతుకులువ్యవసాయ విప్లవంతో బాగుపడ్డాయని సంబరపడ్డాం
కానీ..
కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి… pic.twitter.com/KNSgLZIOjR— KTR (@KTRBRS) September 15, 2024
అబద్దాల పాలనలో గురుకులాలపై చిన్నచూపు అంటూ మరో ట్వీట్లో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఒకటో తేదీన జీతాలు అన్నారు. ఇదేనా అంటూ ప్రశ్నించారు. జీతాలు సమయానికి ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు గడిచేది ఎట్లా అని నిలదీశారు. గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యానికి రక్షణ లేదు, వారి ప్రాణాలకు భరోసా లేదన్నారు. ఇప్పుడు జీతాలు సమయానికి ఇవ్వకుండా గురుకుల ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచింది. ఏనాడైనా ఒక్క రోజు విద్యా శాఖ మీద రివ్యూ చేశారా?, సకాలంలో వేతనాలు రాకపోతే గురుకుల ఉద్యోగులకు నెల గడిచేది ఎలా? అంటూ ప్రశ్నలు సంధించారు.
అబద్దాల పాలనలో గురుకులాలపై చిన్నచూపు
ఒకటో తేదీన జీతాలు అన్నారు. ఇదేనా?
జీతాలు సమయానికి ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు గడిచేది ఎట్లా?
గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యానికి రక్షణ లేదు, వారి ప్రాణాలకు భరోసా లేదు
ఇప్పుడు జీతాలు సమయానికి ఇవ్వకుండా గురుకుల ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున… pic.twitter.com/gWK7oXFfSY
— KTR (@KTRBRS) September 15, 2024