హైదరాబాద్: ప్రజాస్వామ్యం జవాబుదారీతనంతోనే వర్ధిల్లుతుందని, దౌర్జన్యంతో కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రజాస్వామ్యం, ప్రజల హక్కుల గురించి రాహుల్ గాంధీ ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని తుంగలొ తొక్కుతుంటే కళ్లు మూసుకున్నారని విమర్శించారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమేనా మీ ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. ప్రజల గొంతుకే అసలైన ప్రజాస్వామ్యమని ఎక్స్ వేదికగా చెప్పారు.
‘జవాబుదారీతనంతోనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. దౌర్జన్యం కాదు. ప్రజల హక్కుల గురించి రాహుల్ గాంధీ ఎన్నో ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతుంటే రాహుల్ కళ్లు మూసుకున్నారు. రాహుల్ జీ.. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా గుర్తుచేస్తున్నా.. ప్రజల గొంతుకే అసలైన ప్రజాస్వామ్యం. అణచివేత కాదు.
బుల్డోజర్లతో ఇండ్లు కూల్చడం, అసమ్మతిని అణచివేయడం, జర్నలిస్టులపై దాడి చేయడమేనా ప్రజాస్వామ్యం?. ప్రశ్నించే గొంతులను అణచివేయడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులు చేయడమేనా మీ ప్రజాస్వామ్యం?. ఇది ప్రజాస్వామ్యం కాదు.. నిరంకుశత్వం, అరాచకం.’ అంటూ ట్వీట్ చేశారు.
Democracy thrives on accountability, not tyranny!
On the #InternationalDayofDemocracy, I want to remind @RahulGandhi Ji who preaches about democracy and people’s rights but turns a blind eye as CM Revanth Reddy tramples it in Telangana!
Mr. Gandhi, true democracy is about the…
— KTR (@KTRBRS) September 15, 2024