లండన్: ఇంగ్లండ్‌లో జరిగే ద హండ్రెడ్ క్రికెట్ టోర్నీ గురించి గురువారం ఆటగాళ్ల వేలం జరిగింది. అయితే ఆ వేలంలో పాల్గొన్న సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు.. పాకిస్థానీ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్(Abrar Ahmed)ను కొనుగోలు చేసింది. దీంతో సన్ టీవీకి చెందిన ఓనర్స్‌పై ఆన్లైన్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. పాకిస్థానీ క్రికెటర్‌ను ఎలా వేలంలో కొనుగోలు చేశారని సన్‌రైజర్స్ జట్టు యజమాని కావ్య మారన్‌పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ద హండ్రెడ్ టోర్నీలో మొత్తం 8 జట్లు పోటీపడనున్నాయి. దీని కోసం జరిగిన క్రికెటర్ల వేలంలో అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ జట్టు సొంతం చేసుకున్నది. కోచ్ డేనియల్ వెటోరి పాకిస్తానీ క్రికెటర్‌కు ప్రియార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2.34 కోట్లకు అబ్రార్‌ను సన్‌రైజర్స్ జట్టు కొనుగోలు చేసింది. గతంలో నార్తర్న్ సూపర్ఛార్జర్స్ పేరుతో ఉన్న జట్టును సన్‌టీవీ టేకోవర్ చేసుకున్నది. అయితే ఐపీఎల్లో భాగస్వామ్యులైన మరో మూడు ఫ్రాంచైజీలు కూడా ద హండ్రెడ్ టోర్నీలో పాల్గొనే జట్ల కోసం కొంత వాటా తీసుకున్నారు.

సన్ టీవీ ఓనర్స్కు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, దక్షిణాఫ్రికా టీ20 టోర్నీలో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్లు ఉన్నాయి. ఈ రెండు జట్లలో పాకిస్థానీ క్రికెటర్లు లేరు. అయితే సన్‌రైజర్స్ లీడ్స్ కోసం మాత్రం పాకిస్థానీ స్పిన్నర్‌ను కొనుగోలు చేయడం వివాదాస్పదంగా మారింది. ద హండ్రెడ్ టోర్నీలో బర్మింగ్‌హామ్ ఫినిక్స్ జట్టు మరో పాక్ స్నిన్నర్ ఉస్మాన్ తారిక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 2008 నుంచి పాకిస్థాన్, ఇండియా మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్లో పాక్ ప్లేయర్లు పాల్గొనడం లేదు.