Thaai Kizhavi | ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్, ఇప్పుడు 63 ఏళ్ల వయసులో ఒక పవర్ఫుల్ బామ్మ పాత్రతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతుంది. ఆమె ప్రధాన పాత్రలో శివకుమార్ మురుగేసన్ దర్శకత్వంలో వచ్చిన ‘తాయ్ కిళవి’ చిత్రం విడుదలైన కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల మైలురాయిని దాటి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కేవలం రూ.9 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే పెట్టిన పెట్టుబడికి 5 రెట్ల లాభాలను తెచ్చిపెట్టింది.
ఏ విధమైన స్టార్ హీరో లేకపోయినా, కేవలం రాధికా నటన మరియు కథా బలంతోనే ఈ సినిమా అద్భుతాలు చేస్తోంది. ఈ చిత్రంలో ఆమె ‘పావునుతాయ్’ అనే కరుడుగట్టిన వడ్డీ వ్యాపారిగా, తన ఆస్తి కోసం పాకులాడే కొడుకులను ఎదిరించే ఒక పవర్ఫుల్ పాత్రలో నటించింది రాధిక. ఈ విజయంపై స్పందించిన రాధికా, “హీరోల సినిమాల్లా మా టికెట్ ధరలు కూడా ఎక్కువగా ఉంటే ఈ సినిమా ఇప్పటికే రూ.100 కోట్లు దాటేది అని పేర్కొంది. ఇక ప్రముఖ నటుడు శివకార్తికేయన్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.