Ram Charan | రామ్ చరణ్ బర్త్‌డేకు డబుల్ ధమాకా.. ‘RC17’ అప్డేట్తో పాటు ‘పెద్ది’ టీజర్?
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఈ ఏడాది మార్చి నెల ఎంతో ప్రత్యేకంగా మారబోతోంది. ముఖ్యంగా మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు వరుస సర్ప్రైజ్లు ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘రంగస్థలం’ వంటి భారీ విజయానంతరం రామ్ చరణ్, స్టార్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందనున్న కొత్త చిత్రం ‘RC17’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఈ ఏడాది మార్చి నెల ఎంతో ప్రత్యేకంగా మారబోతోంది. ముఖ్యంగా మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు వరుస సర్ప్రైజ్లు ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘రంగస్థలం’ వంటి భారీ విజయానంతరం రామ్ చరణ్, స్టార్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందనున్న కొత్త చిత్రం ‘RC17’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల పుష్ప2 సినిమాతో సంచలన విజయం సాధించిన సుకుమార్, తదుపరి ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను రూపొందించనున్నందున దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది.
ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘RC17’కు సంబంధించిన ఒక పవర్ఫుల్ అప్డేట్ ఇవ్వడానికి చిత్ర బృందం సిద్ధమవుతోందని టాక్. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కానుందో కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, సుకుమార్ ఒక బలమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే మరోవైపు దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది ప్రస్తుతం చివరి దశ షూటింగ్లో ఉంది. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘పెద్ది’ సినిమా టీజర్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ పాటతో పాటు గ్లింప్స్ సోషల్ మీడియాలో మంచి స్పందన అందుకున్నాయి. దీంతో టీజర్ విడుదలైతే సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఒకే రోజు ‘RC17’ సినిమాకు సంబంధించిన అప్డేట్, అలాగే ‘పెద్ది’ టీజర్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో మార్చి 27న రామ్ చరణ్ అభిమానులకు నిజంగా డబుల్ ధమాకా అందబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు అప్డేట్లు సోషల్ మీడియాలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాయో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

