రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో వాతావరణం పూర్తిగా వేసవి కాలాన్ని తలపిస్తోంది. అక్టోబర్ నెలలోనే ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట దాటిన తర్వాత ఏకంగా 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత...
– జూలూరుపాడులో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
– మధ్యాహ్నం వేళ బయటకు వచ్చేందుకు జంకుతున్న జనం
- ఎల్ నినో ప్రభావంతో అడుగంటుతున్న జలాశయాలు
జూలూరుపాడు, అక్టోబర్ 14 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో వాతావరణం పూర్తిగా వేసవి కాలాన్ని తలపిస్తోంది. అక్టోబర్ నెలలోనే ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట దాటిన తర్వాత ఏకంగా 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. ఈ ఉష్ణోగ్రతల తీవ్రత చూస్తుంటే మే నెలలో వచ్చే ‘రోహిణి కార్తె’ గుర్తుకు వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూర్యుడి ప్రతాపానికి భయపడి జనం మధ్యాహ్న సమయంలో ఇళ్ల నుండి బయటకు అడుగు పెట్టేందుకు జంకుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులన్నీ వాహనాలు, జన సంచారం లేక నిర్మానుష్యంగా మారిపోయాయి.
మరోవైపు, ‘ఎల్ నినో’ ప్రభావం వ్యవసాయ రంగంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోంది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో చెరువులు, కుంటలు, చెలకల్లో సైతం నీరు అడుగంటిపోతోంది. పచ్చగా కళకళలాడాల్సిన పంట పొలాలు తగినంత నీరు అందక వడబడిపోతున్నాయి. ఈ అకాల ఎండలు, నీటి ఎద్దడి కారణంగా అటు సాధారణ ప్రజానీకంతో పాటు, ఇటు రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత విషమిస్తాయేమోనని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు, రైతులను ఆదుకునేందుకు అధికారులు తగిన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suriya | సూర్యతో ఆ మూడు సినిమాలు మిస్ కావడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన నజ్రియా!
Syndar c | ఏఐతో సినిమాలు తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.. ‘మహాశక్తి’ డైరెక్టర్ సుందర్ సి ఆసక్తికర వ్యాఖ్యలు!
Bigg Boss 10 | బిగ్బాస్ హౌస్లో సుధీర్ విధ్వంసం.. ముకేష్, అమన్తో గొడవ, నన్ను ఎలిమినేట్ చేయండంటూ ప్రేక్షకులకు విజ్ఞప్తి!
సముద్రంలో 60 రోజులు.. పెంపుడు కుక్కతో సహా ప్రాణాలతో బయటపడ్డ 86 ఏండ్ల వృద్ధుడు!
KRMB Meeting | కేఆర్ఎంబీ మీటింగ్ మళ్లీ వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

