Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడు పర్వీందర్ సింగ్ జోతాను ఓ కెమిస్ట్ షాపు ఓనర్ తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే మెడికల్ షాపు ఓనర్ అశ్వనీ కుమార్ ఇంటిని అధికారులు ఇవాళ బుల్డోజర్లతో కూల్చివేశారు. పర్వీందర్ను చంపిన నిందితుడిని రాజస్థాన్లోని సలాసర్లో ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.
చండీఘడ్: పంజాబ్లోని మనసాలో మంగళవారం డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి పర్వీందర్ సింగ్ జోతాను ఓ కెమిస్ట్ షాపు ఓనర్ తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆ ఘటన పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మెడికల్ షాపు ఓనర్ అశ్వనీ కుమార్ఇం టిని అధికారులు బుల్డోజర్ల(Bulldozers)తో ఇవాళ కూల్చివేశారు. పర్వీందర్ను చంపిన నిందితుడిని రాజస్థాన్లోని సలాసర్లో ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కాల్పులు జరిపిన తర్వాత నిందితుడు పరారీ అయ్యాడు. అతని కోసం గాలింపు చేపట్టారు. అతని కవల సోదరుడు విపిన్ను కూడా అరెస్టు చేశారు.
నిషేధిత మందులను అమ్ముతున్నారని షాపు ఓనర్పై కుమార్ వాగ్వాదానికి దిగాడు. ఘర్షణ తీవ్రం కావడంతో నిందితుడు తుపాకీతో చంపేస్తాడు. ఈ ఘటనను నిరసిస్తూ మానసాలో భారీ ప్రదర్శనలు చేపట్టారు. న్యాయం దక్కేవరకు జోతా అంత్యక్రియలు నిర్వహించబోమన్నారు. అక్టోబర్ 15వ తేదీన బంద్ కోసం పిలుపునిచ్చారు.
VIDEO | Punjab: Bulldozer action was initiated to raze the house of an accused chemist, Ashwini Kumar, in Mansa following public outrage over the murder of anti-drug activist Parvinder Singh Jhota.
(Full video available on PTI Videos – https://t.co/d8jp61yd2p) https://t.co/s3ERC8jMC9
— Press Trust of India (@PTI_News) October 14, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

