Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని తొమ్మిది నెలల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది.
ఉట్కూరు : వాటర్ బాటిల్ మూత ( Bottle Cap ) గొంతులో ఇరుక్కుని తొమ్మిది నెలల చిన్నారి మృతి ( Child Died ) చెందిన విషాద ఘటన నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలోని దేవినగర్లో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న లక్ష్మణ్, గాయత్రి దంపతుల కుమారుడు ఆర్యవర్ధన్ మంగళవారం ప్రమాదవశాత్తు వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా దవాఖానకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం చిన్నారి మృతి చెందాడు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పటివరకు ఆడుకుంటూ ఉన్న చిన్నారి విగతజీవిగా మారడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
- Tags
- Child died
- Stuck
- Throat
- Utkur
RELATED ARTICLES
తాజా వార్తలు
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

