డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకట్యతండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ అంతిమయాత్రలో ఏర్పాటు చేసిన డీజే ట్రాలీ క్యాబిన్లో టపాసులు పేలడంతో నలుగురు గాయపడ్డారు. వీరిలో భూక్య రానా, ఆంగోతు ధ్రువన్ తీవ్రంగా గాయపడగా....
– టేకులపల్లి మండలం బేతంపూడి పంచాయతీ పరిధి వెంకట్యతండాలో ఘటన
టేకులపల్లి, అక్టోబర్ 14 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకట్యతండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ అంతిమయాత్రలో ఏర్పాటు చేసిన డీజే ట్రాలీ క్యాబిన్లో టపాసులు పేలడంతో నలుగురు గాయపడ్డారు. వీరిలో భూక్య రానా, ఆంగోతు ధ్రువన్ తీవ్రంగా గాయపడగా, ధరావత్ రవికుమార్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. డీజే ట్రాలీ క్యాబిన్లో టపాసులు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి క్యాబిన్లో ఉన్నవారు గాయపడడంతో స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. తొలుత టేకులపల్లి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించగా, తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న టేకులపల్లి ఎస్ఐ కోగిల తిరుపతి టేకులపల్లి రిమ్స్ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అంతిమయాత్రలో టపాసులు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం.. పోలీసుల దాడుల్లో విద్యార్థి నేతలు గాయపడ్డారని ఆరోపణ
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

