Nitin Gadkari | కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధానిగా రేసులో నిలిస్తే మద్దతు ఇస్తామంటూ ప్రతిపక్షం ఆఫర్ ఇచ్చిందని.. అయితే, తాను ఆ ఆఫర్‌ని తిరస్కరించానన్నారు. ప్రధానిమంత్రి కావడం తన ఆశయం కాదని చెప్పానన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన జర్నలిస్టుల అవార్డుల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు ఓ సంఘటన గుర్తుందని.. తాను ఎవరి పేరు చెప్పడం లేదన్నారు. మీకు ప్రధానమంత్రి కావాలని అనుకుంటే మద్దతిస్తామని చెప్పారన్నారు. తనకు మీరు నాకు ఎందుకు మద్దతు ఇవ్వాలి ? నేను ఎందుకు మీ మద్దతు తీసుకోవాలని ప్రశ్నించానన్నారు. పీఎం కావడం తన జీవితాశయం కాదని.. విశ్వాసానికి.. తన సంస్థకు విధేయుడినన్నారు. ఈ విషయంలో తాను రాజీపడనన్నారు.
పదవి కంటే విశ్వాసం చాలా ముఖ్యమైందని గడ్కరీ అభిప్రాయపడ్డారు. రాజకీయాలతో పాటు జర్నలిజంలోనూ నైతిక విలువలు పాటించాలని గడ్కరీ సూచించారు. కమ్యూనిస్ట్ నేత ఏబీ బర్ధన్ ఆర్ఎస్ఎస్ వ్యతిరేకి అయినా.. ఆయనను గౌరవించాలని గడ్కరీ సూచించారు. నాగ్‌పూర్-విదర్భ ప్రాంతానికి చెందిన కీలక రాజకీయ నేతల్లో ఆయన ఒకరన్నారు. నిజాయితీ గల ప్రతిపక్షాన్ని గౌరవించాలని.. ఓ సీపీఐ నేతకు ఇదే విషయాన్ని చెప్పినట్లు గడ్కరీ తెలిపారు. నిజాయితీ లేని వ్యక్తికి గౌరవం అక్కర్లేదన్నారు. కామ్రేడ్ బర్ధన్ తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని, ప్రస్తుతం రాజకీయాలతో పాటు జర్నలిజంలో అలాంటి వ్యక్తులు లేరని గడ్కరీ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక, శాసనసభ, మీడియా అనే నాలుగు స్తంభాలు నిజాయితీగా నడిచిన సమయంలోనే ప్రజాస్వామ్యం విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు.
#WATCH | Nagpur, Maharashtra | Union Minister Nitin Gadkari says, “I do not want to name anyone but a person said to me, if you are going to become a Prime Minister, we will support you. I said, why you should support me, and why I should take your support. To become a Prime… pic.twitter.com/yo6QDpqq5b
— ANI (@ANI) September 15, 2024