Harish Rao | హైదరాబాద్ : అదానీ దొంగ అని, అవినీతి చేసిండని రాహుల్ గాంధీ తిడితే, రేవంత్ రెడ్డి ఇక్కడ చీకటి ఒప్పందాలు చేసుకుంటడు.. అలాయ్ బలాయ్ చేసుకుంటడు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. శాసనసభలోకి వెళ్లకుండా ప్రతిపక్ష నాయకులను అడ్డుకొని అరెస్టులు చేయడం పట్ల హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. అదానీతో వేలకోట్ల రూపాయలు ఒప్పందాలు చేసుకుంటడు. ఇదెక్కడి న్యాయం. వివిధ మార్గాల్లో ప్రతిపక్షాలు నిరసనలు తెలియచేస్తుంటాయి. అడ్డుకోవడం దుర్మార్గం. అక్రమ సంబంధాలు, చీకటి ఒప్పందాలు బయట పడుతాయని ప్రతిపక్షాన్ని సభలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. సభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు. అదానీతో చీకటి ఒప్పందం బయటపడిందని, మేము ప్రశ్నిస్తామని భయపడుతున్నరు అని హరీశ్‌రావు తెలిపారు.
మమ్మల్ని సభలోకి రాకుండా ఎందుకు ఆపుతున్నావు రేవంత్ రెడ్డి? పార్లమెంట్లో రాహుల్, ప్రియాంకలు అదానీ, మోడీ బాయి బాయి అనే స్లోగన్స్ తో టీషర్ట్స్ వేసుకున్నరు. మేము ఇక్కడ అదే విధంగా మీ చీకటి ఒప్పందాన్ని ప్రశ్నిస్తే తప్పేంటి..? నువ్వు తప్పు చేసినవు కాబట్టే మేం ప్రశ్నిస్తామని మీరు భయపడుతున్నారని రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
శాసనసభలోకి వెళ్లకుండా ప్రతిపక్ష నాయకులను అడ్డుకొని అరెస్టులు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి @BRSHarish
అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం.
అదానీ దొంగ అని, అవినీతి చేసిండని రాహుల్ గాంధీ తిడితే, రేవంత్ రెడ్డి ఇక్కడ చీకటి ఒప్పందాలు చేసుకుంటడు.అలాయ్ బలాయ్… pic.twitter.com/mbXy4twvoD
— Office of Harish Rao (@HarishRaoOffice) December 9, 2024
ఇవి కూడా చదవండి..
BRS | నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన పోలీసులు
KTR | అదానీ.. రేవంత్ దోస్తానాను శాసనసభ వేదికగా ఎండగడతాం: కేటీఆర్
Assembly Session | అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు