BRS | నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రధాన ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేశారు. అనంతరం కేటీఆర్, కవిత సహా పార్టీ ప్రజాప్రతినిధులను పోలీసు వ్యానుల్లో అక్కడి నుంచి తరలించారు.
హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేశారు. అనంతరం కేటీఆర్, కవిత సహా పార్టీ ప్రజాప్రతినిధులను పోలీసు వ్యానుల్లో అక్కడి నుంచి తరలించారు. సోమవారం ఉదయం దీక్షా విజయ్ దివస్ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, అదానీ ఫొటోతో కూడిన టీషర్టులను ధరించి అసెంబ్లీకి బయల్దేరారు. దీంతో అసెంబ్లీ గేటు-2 వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్, అదానీతో కూడిన టీషర్టు ధరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొన్నది.

ఈ నేపథ్యంలో పోలీసుల అధికారులను కేటీఆర్ నిలదీశారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు. రేవంత్ అదానీ భాయి భాయి అంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ, తెలంగాణ తల్లి మాది.. కాంగ్రెస్ తల్లి నీది, బతుకమ్మను తీసి చేయి గుర్తు పెట్టిందంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ క్రమంలో కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సబితా ఇంద్రారెడ్డితోపాటు పార్టీ ప్రజాప్రతినిధులు అరెస్టు చేసి పోలీసు వ్యానుల్లో అక్కడి నుంచి తరలించారు.
రేవంత్, ఆదాని దోస్తీ టీ షర్టులతో నిరసన తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకొని అరెస్టు చేసిన పోలీసులు. pic.twitter.com/kycISjKXtr
— BRS Party (@BRSparty) December 9, 2024
శాసనసభలోకి వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అరెస్ట్ చేసిన పోలీసులు.
పార్లమెంట్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు అదానీ, మోడీ భాయ్ భాయ్ అనే స్లోగన్స్ తో టీషర్ట్స్ వేసుకుని వెళ్లారు, అలాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో మాత్రం అదే అదానీ-రేవంత్ చీకటి… pic.twitter.com/ZDKZY3n05Z
— BRS Party (@BRSparty) December 9, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Assembly session
- BRS
- harish rao
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

