Harish Rao | హైదరాబాద్ : ఎన్ని రాళ్లు విసురుతావో విసురు.. ఆ రాళ్లే మళ్లీ మా ప్రభుత్వం రావడానికి పునాది రాళ్లుగా మారుతాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. రాళ్ల దాడులకు భయపడుతారు అనుకుంటున్నావేమో.. పోరాటాలు తమకు కొత్తేం కాదు అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు. కోకాపేట్‌లోని తన నివాసంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి నగ్నంగా బయటపడ్డారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో హైకోర్టు మొట్టికాయకలు వేసింది. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారా..? లేదంటే సుమోటోగా కేసు టేకాఫ్ చేకాఫ్ చేస్తామని కోర్టు చెప్పింది. దాన్నుంచి దృష్టి మరల్చడానికి కౌశిక్ రెడ్డి మీద దాడి చేయించి కుట్ర చేస్తున్నారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ టాక్టిక్స్ చేస్తుంటారు. ఒక సమస్య నుంచి తప్పించుకునేందుకు కొత్త సమస్యలను సృష్టిస్తారు. ఆరు గ్యారెంటీల అమలు గురించి మాట్లాడితే.. దాన్ని మరిపించేందుకు ఒక డ్రామా చేస్తారు. రుణమాఫీపై పోరాడితే హైడ్రా అని ఒక డ్రామా పెట్టిండు. ఖమ్మం వెళ్లి కాంగ్రెస్ ఫెయిల్యూర్‌ను ఎండగడితే రాళ్ల దాడి చేయించారు. పార్టీ ఫిరాయింపుల మీద హైకోర్టు మొట్టికాయలు వేస్తే పీఏసీ నియామకం చేసి డైవర్షన్ చేసిండు. రైతుబంధు ఎందుకు ఇస్తావలే అని అడిగితే కాళేశ్వరం లీక్ అయిందని డ్రామాలు ఆడుతారు. ఎన్ని డ్రామాలు ఆడినా తెలంగాణ ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి సమాధి కడుతారని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
రాళ్లతో దాడులు చేయిస్తే భయపడుతారు అని అనుకుంటున్నావేమో.. మాకేం పోరాటాలు, ఉద్యమాలు కొత్త కాదు.. అరెస్టులు అంతకంటే కొత్తకాదు. 14 ఏండ్లు కొట్లాడి జైలుకు పోయినం, లాఠీ దెబ్బలు తిన్నాం.. పదవులను త్యాగం చేసి రాష్ట్రం సాధించాం. అందుకే తెలంగాణ గురించి బాధ్యతగా ఆలోచిస్తున్నాం. ఎన్ని రాళ్లు విసురుతావో విసురు.. ఆ రాళ్లే మళ్లీ మా ప్రభుత్వం రావడానికి పునాది రాళ్లుగా మారుతాయని హరీశ్‌రావు తెలిపారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచాం. ఇటీవల 16వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి వస్తే.. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం చాలా బాధ్యతయుతంగా ప్రభుత్వం కంటే బలమైన వాదన వినిపించాం. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిన విషయాన్ని ఆర్థిక సంఘానికి వివరించాం. నిధులు కావాలని అడిగాం. కానీ ప్రభుత్వం తప్పడు లెక్కలు చూపించింది. మేం చెప్పినట్టు చెప్పలేకపోయింది. మాకు రాజకీయం ముఖ్యం కాదు.. రాష్ట్రం ముఖ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం కంటే బలమైన వాదన వినిపించాం. అది మాకు తెలంగాణ ప్రజలతో ఉన్న పేగు బంధం. మీరు గృహ నిర్బంధాలు చేసినా మా సంకల్పాన్ని నీరుగార్చలేరు అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | గుడ్డిగా రేవంత్ మాటలను ఫాలో కాకండి.. డీజీపీకి హరీశ్‌రావు సూచన