Harish Rao | హైదరాబాద్ : గుడ్డిగా రేవంత్ రెడ్డి మాటలను ఫాలో కాకండి అని రాష్ట్ర డీజీపీతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. కోకాపేటలోని తన నివాసంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
డీజీపీకి చెప్పేది ఒక్కటే.. అది అత్యున్నతమైన పోస్టు.. పెద్ద పదవి. మీరు బాధ్యతయుతంగా వ్యవహరించాలి. రేవంత్ రెడ్డి గురించి మీకు తెలియనిది కాదు.. గతంలో ఇదే రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులను బండ బూతులు తిట్టిండు. చిల్లరగా మాట్లాడారు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవడ్రా మీరు అని పోలీసులను తిట్టారు. కానీ మేం పోలీసులకు సహకరిస్తున్నాం. ఇదే పోలీసులను పట్టుకుని బీహారీ పోలీసులు అని మాట్లాడారు. గుడ్డిగా రేవంత్ మాటలను ఫాలో కాకండి.. విచక్షణతో వ్యవహరించండి. చట్టాన్ని గౌరవిచండి.. చట్టాన్ని అమలు చేయండి. తప్పు చేయమని రేవంత్ రెడ్డి చెబితే నిష్పక్షపాతంగా, న్యాయబద్దంగా వ్యవహరించాలని కోరుతున్నానని హరీశ్‌రావు పేర్కొన్నారు.
నిన్న లా అండ్ ఆర్డర్ ఏమైంది… నిన్న గాంధీని ఆపొచ్చు కదా..? నిన్న ఆయనను ఆపి ఉంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినేదా..? మరి ఎనిమిది పోలీసు స్టేషన్లు దాటించి, కౌశిక్ రెడ్డి ఇంటి లోపలికి పంపించి దాడి చేయించారు. మరి నిన్న ఎందుకు యాక్ట్ చేయలేదు. దీనికి కారణం సీఎం, డీజీపీ కాదా..? ఇప్పుడేమో సీఎం, డీజీపీ సన్నాయి నొక్కులు నొక్కతున్నారు. ఎవరి మీద దాడులు చేయాలని రివ్యూలు చేస్తారా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
నిన్న రాళ్ల దాడి చేసిన వారికి రాచమర్యాదలు చేశారు. పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి బిర్యానీలు, సమోసాలు తినిపించి, ఆ తర్వాత ఎస్కార్ట్ ఇచ్చి ఇంటింకి పంపించారు. కౌశిక్ రెడ్డి మీద దాడి విషయంపై మేం ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. అరెస్టు చేసి 2 గంటలు హైదరాబాద్‌లో తిప్పి అర్ధరాత్రి మహబూబ్‌నగర్ జంగిల్లో విడిచిపెట్టారు. ఇదేనా పోలీసులు ప్రవర్తించే తీరు.. రాష్ట్రంలో లా అండర్ ఆర్డర్ ఉందా..? అని నిలదీశారు హరీశ్‌రావు.
ఇవి కూడా చదవండి..