Harish Rao | హైదరాబాద్ : మూసీపై పూటకో మాట మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పలు సందర్భాల్లో.. పలు వేదికల్లో మూసీపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను హరీశ్‌రావు గుర్తు చేశారు.
మూసీ పరివాహక అభివృద్ధి కోసం ఐదేండ్లలో రూ. లక్షా 50 వేల కోట్లతో ప్రణాళికలు సిద్దం చేసినట్లు జులై 20వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సెప్టెంబర్ 6న సీఎం చేతుల మీదుగా విడుదల చేసిన ‘తెలంగాణ గ్రోత్ స్టోరీ ద రోడ్ టు వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ’ విజన్ డాక్యుమెంట్లోనూ.. రూ. లక్షా 50వేల కోట్లు అంటే సుమారు 18 బిలియన్ల డాలర్లతో ఐదేండ్లలో మూసీ రివర్ ఫ్రంట్ రీడెవలప్మెంట్ కొరకు ఖర్చు చేస్తున్నట్లుగా పేర్కొన్నారని హరీశ్‌రావు గుర్తు చేశారు.
మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రూ. లక్షా 50 వేల కోట్లు ఎవరన్నారంటూ రేవంత్ ఆవేశంతో ఊగిపోయారు. పూటకో తీరుగా మాట్లాడుతున్న మిమ్మల్ని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుంది. బిడ్డ పుట్టక ముందే కుల్ల కుట్టినట్లు డీపీఆర్ లేకుండా రూ. లక్షా 50వేల కోట్లు ఖర్చవుతాయని చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లుతుంది. మూసీ రిజువినేషన్ అండ్ రివర్ ఫ్రంట్ పేరుతో ప్రజాధనం లూఠీ చేయాలనే మీ కుట్రలను బట్టబయలు చేస్తాం. మీ నిరంకుశ విధానాలను అడుగడుగునా ఎండగడతాం. తెలంగాణ ప్రజల తరుపున నిలదీస్తామని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఆహ్వానించింది మీరే.. అరెస్ట్ చేసింది మీరే.. ఆర్ఎస్పీ హౌజ్ అరెస్ట్‌పై హరీశ్‌రావు ఫైర్
VRA | సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు వీఆర్ఏల ధర్నా.. వారసత్వ ఉద్యోగాలకు డిమాండ్