RS Praveen Kumar | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గోషామహల్ పోలీసు స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐపీఎస్‌లతో పాటు పలువురు సీనియర్ ఐపీఎస్‌లను కూడా డీజీపీ జితేందర్ ఆహ్వానించారు.
అయితే పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా పరేడ్‌కు రావాలని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ప్రభుత్వం నుంచి అందింది. కానీ ఆర్ఎస్పీని నిన్న రాత్రిలో గృహ నిర్బంధంలో ఉంచారు పోలీసులు. ఇది సరైనా పద్ధతేనా అని డీజీపీని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు సోదరులకు నివాళులు అర్పించే అర్హత కూడా నాకు లేదా? నేనేమైనా టెర్రరిస్టునా..? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి గారూ.. ఎందుకు ఇంత భయపడుతున్నారు మేమంటే? ఎన్నాళ్లీ ఈ అరాచకాలు..? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రోజు పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా పరేడ్ కు రమ్మని ఆహ్వానించి, నన్ను నిన్న రాత్రి నుండే గృహ నిర్బంధం లో ఉంచారు @TelanganaDGP గారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు సోదరులకు నివాళులు అర్పించే అర్హత కూడా నాకు లేదా? నేనేమైనా టెర్రరిస్టునా??@revanth_anumula గారు,… pic.twitter.com/6ZZ31OtJZ0
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 21, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఆహ్వానించింది మీరే.. అరెస్ట్ చేసింది మీరే.. ఆర్ఎస్పీ హౌజ్ అరెస్ట్‌పై హరీశ్‌రావు ఫైర్
VRA | సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు వీఆర్ఏల ధర్నా.. వారసత్వ ఉద్యోగాలకు డిమాండ్
Warangal | ఎనుమాముల మార్కెట్‌కు పోటెత్తిన తెల్ల బంగారం.. ధర ఎంతంటే?