వరంగల్ : రాష్ట్రంలో తెల్ల బంగారానికి(Cotton) కాసుల వర్షం కురుస్తున్నది. సోమవారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు(Warangal Enumamula Agriculture Market) తెల్ల బంగారం పోటెత్తింది. రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి ధర రూ.7,521 పలికినట్లు అధికారులు తెలిపారు. కాగా, రైతులు(Cotton farmers) నాణ్యమైన పత్తి తెచ్చి గరిష్ఠ ధర పొందాలని మంత్రి కొండా సురేఖ తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. కొనుగోలు కేంద్రాల్లోని పత్తిని విక్రయించాలని ఆమె సూచించారు. మార్కెట్‌కు వచ్చిన ప్రతి బస్తాను కొనుగోలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. మార్కెట్లో రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | నందినగర్‌లో కేటీఆర్ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు.. వీడియో
KTR | విధ్వంసకర విధానాలతో జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం ఆఖరి స్థానం : కేటీఆర్
KTR | రైతుబంధు ఎగిరిపోయింది.. రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది: కేటీఆర్