T20 World Cup : ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగే ఆస్ట్రేలియా(Australia) ఘోర అవమానం మూటగట్టుకుంది. మూడేళ్ల క్రితం సగర్వంగా వన్డే వరల్డ్‌కప్‌ను ముద్దాడిన ఆసీస్.. సంచలనాలకు నెలవైన టీ20ల్లో ప్రత్యర్థి వ్యూహాలను ఛేదించలేక చతికిలపడింది. ఒక విజయం.. వరుసగా రెండు ఓటములతో టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశలోనే దిగ్గజ జట్టు ఇంటిదారి పట్టింది. కచ్చితంగా సెమీస్ చేరుతుందనుకున్న ఆసీస్ అనూహ్యంగా గ్రూప్ దశలోనే నిష్క్రమించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
‘బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు అవుతాయి’ అనే సామెతకు ఆస్ట్రేలియా, జింబాబ్వే పక్కా ఉదాహరణ అని చెప్పచ్చు. ఫేవరెట్ జట్టైన ఆసీస్‌ను అండర్ డాగ్ జింబాబ్వే ఇంటికి పంపించింది. ప్రపంచకప్‌లో చెలరేగిపోయే ఆస్ట్రేలియా గ్రూప్ దశ దాటకపోవడం ఇది ఇది రెండోసారి. తొలి సీజన్లో సెమీ ఫైనల్ ఆడిన ఆసీస్.. రెండో సీజన్లో లీగ్ దశలోనే వెనుదిరిగింది. ఆ తర్వాత నుంచి మెరుగైన ప్రదర్శన చేసిన ఆసీస్.. 2010లో రన్నరప్‌గా నిలిచింది. అరోన్ ఫించ్ సారథ్యంలో 2021లో అదరగొట్టిన ఆస్ట్రేలియా ఛాంపియన్‌గా అవతరించింది. అక్కడి నుంచి మళ్లీ నిరాశకు గురి చేసిన ఆసీస్.. ఈసారి గ్రూప్ దశలోనే వైదొలిగింది.
Australia exit in the first round for the first time since 2009 😱 pic.twitter.com/Nym596MYUP
— ESPNcricinfo (@ESPNcricinfo) February 17, 2026
తొలి లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 67 పరుగుల తేడాతో విజయంతో టోర్నీని ఘనంగా ఆరంభించిన ఆస్ట్రేలియాకు జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. 2007లోనూ గెలుపొందిన జింబాబ్వే.. ఈసారి170 లక్ష్య ఛేదనలో ముజరబని(4-17), బ్రాడ్ ఎవాన్స్ (3-23)ల వికెట్ల వేటతో బలమైన ఆసీస్ టాపార్డర్‌ను కూల్చింది. మరో మూడు బంతులుండగానే ఆలౌటైన మిచెల్ మార్ష్ సేనపై23 పరుగులతో గెలుపొందిన ఆఫ్రికా జట్టు.. వరల్డ్‌కప్‌లో కంగారూలపై తమదే పైచేయి అనిపించుకుంది.
ఐసీసీ తొలిసారిగా 2007లో ప్రవేశ పెట్టిన పొట్టికప్‌లో సెమీ ఫైనల్ చేరింది ఆస్ట్రేలియా. అయితే.. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోని భారత్ నిర్దేశించిన 189 పరుగుల్ని ఛేదించలేక 173 వద్దే ఆగిపోయింది. 2009లో గ్రూప్ దశలోనే ఇంటికొచ్చేసింది. 2010 రన్నరప్.. 2012లో సెమీ ఫైనల్స్.. 2014లో సూపర్ 10, 2016లో సూపర్ 10, 2021లో ఛాంపియన్, 2022లో సూపర్ 12, 2024లో సూపర్ 8.. 2026లో ఏకంగా లీగ్ దశలోనే నిష్క్రమించింది.
❌ Did not qualify in 2024
✅ Into the Super Eights in 2026 pic.twitter.com/cgNlFzGP0I— ESPNcricinfo (@ESPNcricinfo) February 17, 2026