KTR | విధ్వంసకర విధానాలతో జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం ఆఖరి స్థానం : కేటీఆర్
KTR | తెలంగాణ ఆర్థిక వ్యవస్థను భ్రష్ఠు పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం దిగజారడంపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు.
KTR | హైదరాబాద్ : తెలంగాణ ఆర్థిక వ్యవస్థను భ్రష్ఠు పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం దిగజారడంపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు.
తెలంగాణలో బుల్డోజర్ రాజ్ సంస్కృతిని తీసుకురావడంతో ఫలితాలు కూడా బుల్డోజర్ ఎకానమీ మాదిరిగా వస్తున్నాయి. గతేడాదితో పోల్చుకుంటే తొలిసారిగా తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు ఒక శాతం కంటే తక్కువకు పడిపోయాయి. జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ ఎప్పుడు కనీసం 15 శాతం వృద్ధిని సాధించేది. తెలంగాణ ఇప్పుడు యూపీ ఆర్థిక వ్యవస్థతో విజయవంతంగా పోటీ పడుతోంది. విధ్వంసకర విధానాలతో జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం ఆఖరి స్థానంలో నిలిపి అనూహ్యమైన ఘనతను సాధించింది. రాష్ట్రంలో అబ్కారీ శాఖ మాత్రమే మంచి పనితీరు కనబరుస్తూ గొప్ప ఫలితాలను ఇస్తోంది. తెలంగాణ వంటి సంపూర్ణంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ప్రత్యేక ప్రతిభ అవసరం. ఈ తిరోగమన పరిస్థితిపై సీఎం సమాధానం చెబుతారని ఆశిస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
When you emulate Bulldozer Raaj, the results will be a bulldozer economy!
For the first time Telangana’s GST collection nosedived to less than 1pc. YOY, Telangana always showed a growth of at least 15pc in GST collections
Telangana is now successfully competing with Uttar… pic.twitter.com/Bo7OpEAU7Z
— KTR (@KTRBRS) October 21, 2024
ఇవి కూడా చదవండి..
KTR | పోలీసు అమరుల త్యాగాలను జాతి ఎన్నటికీ మరువదు: కేటీఆర్
KTR | రైతుబంధు ఎగిరిపోయింది.. రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది: కేటీఆర్
Group-1 Mains | భారీ బందోబస్తు నడుమ.. నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Congress govt
- gst
- KTR
- Revanth Reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

