హైదరాబాద్: అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఒక్కటి కూడా అమలుచేయకపోగా, ఉన్నవాటిని ఎగ్గొట్టడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్ట ప్రస్తుత పరిస్థితి ఉందన్నారు. ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ఊదరగొట్టి, ఉన్న రూ.10 వేలను కూడా ఊడగొట్టారని ఫైరయ్యారు. పంట పెట్టుబడి ఎగ్గొట్టడం అంటే అన్నదాత వెన్ను విరవడమేనని చెప్పారు. కాంగ్రెస్ రైతు ద్రోహి అని, ఆ పార్టీ చరిత్ర నిండా అనేక రుజువులు ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు పంట పెట్టుబడి మరొకటని చెప్పారు. ఎన్నికల సమయంలో రైతుబంధు కావాలా.. రాబందు కావాలా.. అంటూ బీఆర్ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుందా ఎక్స్ వేదిగా ప్రశ్నించారు. రైతుబంధు ఎగిరిపోయింది.. రాబందుల రెక్కల చప్పుడే మిగిలిందని చెప్పారు.
రైతుబంధు కావాలా..? రాబందు కావాలా..?
ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుందా..?
రైతుబంధు ఎగిరిపోయింది..రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది!
నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది పరిస్థితి..!
ఎకరానికి 15వేలు ఇస్తామని ఊదరగొట్టి..ఉన్న పదివేలు ఊడగొట్టారు..!
పంట పెట్టుబడి… pic.twitter.com/fGpgRLZDB3
— KTR (@KTRBRS) October 21, 2024