KTR | హైదరాబాద్ : బంజారాహిల్స్ నందినగర్‌లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వందల సంఖ్యలో పోలీసులను మోహరించి, పదుల సంఖ్యలో పోలీసు వాహనాలను ఉంచారు. నందినగర్ ప్రాంతమంతా పోలీసు బలగాలతో నిండిపోయింది. ఎక్కడా చూసినా పోలీసుల బూట్ల చప్పుడే వినిపిస్తోంది.
గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు మొదట్నుంచి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. జీవో 29పై రద్దు విషయంలో అభ్యర్థుల ఆందోళనలకు కూడా బీఆర్ఎస్ నేతలు మద్దతు ప్రకటించారు. ఇవాళ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేటీఆర్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంటి వద్ద పోలీసులు ఉన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని తన ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.
కేటీఆర్ నివాసం ముందు పోలీసుల మోహరింపు pic.twitter.com/h61MY9Q3wm
— Telugu Scribe (@TeluguScribe) October 21, 2024
ఇవి కూడా చదవండి..
Group-1 | గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం చేసేందుకు.. సుప్రీంకోర్టు వద్ద దాసోజు శ్రవణ్
KTR | విధ్వంసకర విధానాలతో జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం ఆఖరి స్థానం : కేటీఆర్