Rythu Bndhu | హైదరాబాద్ : కేసీఆర్ ఇచ్చే రైతుబంధు ఏంది.. కేవలం రూ. 10 వేలు మాత్రమే ఇస్తున్నారు.. మేం అధికారంలోకి వచ్చాక రైతుభరోసా పేరుతో ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు రైతులను నట్టేట ముంచాడు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేని రూ. 10 వేల రైతుబంధును.. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసింది. అది కూడా దఫాదఫాలుగా.. కొర్రీలు పెడుతూ రైతులకు పంపిణీ చేసింది రేవంత్ సర్కార్. అప్పుడు ఇచ్చింది తప్పితే.. ఇప్పటి వరకు రైతుబంధు ఊసే లేదు. వానాకాలం పంటకు రైతుబంధు ఇవ్వలేదు. యాసంగి పంటకు కూడా రైతుబంధు ఇచ్చే పరిస్థితి లేదు. ఖరీఫ్‌కు రైతుబంధు లేనట్టే అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఈ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రైతుబంధుపై ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఏమన్నాడో ఆ వీడియోలో స్పష్టంగా ఉంది. “రైతుబంధు ఎందుకు బందైతది? మేమేమన్న దీవానాగాళ్లమా, మాకేమన్నా ధమాక్ లేదా? రైతుల కష్టాలు మాకు తెల్వదా? అని ప్రగల్భాలు పలికారు రేవంత్ రెడ్డి.
ఈ వీడియోను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. రూ. 7,500 కోట్లు వానాకాలం రైతుబంధు ఎగ్గొడుతనంటున్న ఈయనను, నేడు తెలంగాణ రాష్ట్ర రైతులు ఏమనుకుంటారంటారు..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి –
“రైతుబంధు ఎందుకు బందైతది? మేమేమన్న దీవానాగాళ్లమా, నాకేమన్నా ధమాక్ లేదా? రైతుల కష్టాలు మాకు తెల్వదా? “
7,500 కోట్లు వానాకాలం రైతుబంధు ఎగ్గొడుతనంటున్న
ఈయనను, నేడు తెలంగాణ రాష్ట్ర రైతులు ఏమనుకుంటారంటారు? pic.twitter.com/n2bBKdIW00— KTR (@KTRBRS) October 21, 2024
ఇవి కూడా చదవండి..
CM Revanth Reddy | ఖద్దరును, ఖాకీని ప్రజలు నిశితంగా గమనిస్తారు: సీఎం రేవంత్ రెడ్డి
Group-1 | గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం చేసేందుకు.. సుప్రీంకోర్టు వద్ద దాసోజు శ్రవణ్
KTR | విధ్వంసకర విధానాలతో జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం ఆఖరి స్థానం : కేటీఆర్