Group-1 | న్యూఢిల్లీ : గ్రూప్-1 నియామకాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29పై గ్రూప్-1 అభ్యర్థులు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. జీవో 29ను రద్దు చేశాకే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థుల విన్నపాలను పెడచెవిన పెట్టింది.
జీవో 29పై హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు కూడా అభ్యర్థుల పిటిషన్లను కొట్టేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు అన్యాయం చేసేలా కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన జీవో 29ను కోర్టు కూడా సమర్థించేలా అభ్యర్థుల పిటిషన్లను డిస్మిస్ చేసింది. హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ రెండు కూడా అభ్యర్థులకు వ్యతిరేకంగా తీర్పును ఇచ్చాయి.
దీంతో గ్రూప్-1 అభ్యర్థులు తమకు అండగా నిలవాలని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ను కోరారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావు గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థుల తరపున ప్రభుత్వానికి బలమైన వాదన వినిపించారు. జీవో 29ను రద్దు చేయాలని, ఆ తర్వాతే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానీ రేవంత్ సర్కార్ స్పందించలేదు. ఇక చివరకు గ్రూప్-1 అభ్యర్థుల తరపున బీఆర్ఎస్ నేత, న్యాయవాది దాసోజు శ్రవణ్ జీవో 29పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మరికాసేపట్లో విచారణకు రానుంది. విచారణ సందర్భంగా కోర్టుకు హాజరయ్యేందుకు దాసోజు శ్రవణ్ సిద్ధమయ్యారు. గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం చేసేందుకు అని పేర్కొంటూ లాయర్ డ్రెస్సులో ఉన్న ఫోటోను శ్రవణ్ పంచుకున్నారు. సత్యమేవ జయతే అని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. బెస్ట్ విషెస్ అన్న అని కేటీఆర్ తెలిపారు.
Best wishes Anna https://t.co/vyiLirwq4Q
— KTR (@KTRBRS) October 21, 2024
ఇవి కూడా చదవండి..
KTR | విధ్వంసకర విధానాలతో జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం ఆఖరి స్థానం : కేటీఆర్
Nagarkurnool | నాగర్‌కర్నూల్ జిల్లాలో పెద్దపులి సంచారం.. భయాందోళనలో ప్రజలు
Nagarjunasagar | నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద.. 20 గేట్లు ఎత్తివేత