నల్లగొండ : నాగార్జునసాగర్(Nagarjunasagar) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. కృష్ణా నది ఎగువు ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. తాజాగా సాగర్‌కు వరద ప్రవాహం (Continued flood flow) కొనసాగుతున్నది. సాగర్ 20 గేట్లు ఎత్తి(20 gates lifted) అధికారులు దిగువకు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 2,05,00 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో2,46,500 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం589.10 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం1091 అడుగులుగా ఉంది. ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుండటంతో సాగర్ దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.