Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ లెక్చర్లు ఆపి.. తెలంగాణలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలపై మాట్లాడాలని హరీశ్‌రావు సూచించారు. కోకాపేటలోని తన నివాసంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
రాహుల్ గాంధీ అమెరికాలో తిరుగుతున్నట్టుండు.. అమెరికాలో పోయి లెక్చర్లు ఇస్తున్నారు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, న్యాయం, ధర్మం అని అంటున్నారు. తెలంగాణలో జరుగుతున్న అణిచివేతలు, ఆంక్షలు, రాజ్యాంగ ఉల్లంఘనలపై రాహుల్ గాంధీ మాట్లాడాలి. ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యేల ఫిరాయింపు, పీఏసీ చైర్మన్ నియామకం.. ఇవన్నీ రాజ్యాంగ ఉల్లంఘనలు. ఈ రాజ్యాంగ ఉల్లంఘనల నుంచి దృష్టి మరల్చడానికి లా అండ్ ఆర్డర్ సమస్యగా సృష్టించి, పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య కొట్లాటకు రేవంత్ రెడ్డి కుట్ర చేశారు. దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల సమస్య మీద నుంచి దృష్టి మరల్చుతున్నడు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాద్‌లో నీ పెత్తనం ఏంటని గాంధీ కౌశిక్ రెడ్డిని ప్రశ్నించారు. దానికి సమాధానంగానే కౌశిక్ రెడ్డి మాట్లాడారు తప్ప, సెటిలర్ల మీద కౌశిక్ కామెంట్ చేయలేదు. ముందు రెచ్చగొట్టింది గాంధీ. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడ బిఆర్ఎస్ నాయకులను అరెస్టులను చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు మహిళలని చూడకుండా అరెస్టులు చేయడం దుర్మార్గం. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | రేవంత్ విసిరే రాళ్లు.. రేపటి మా ప్రభుత్వానికి పునాది రాళ్లు : హరీశ్‌రావు
Harish Rao | గుడ్డిగా రేవంత్ మాటలను ఫాలో కాకండి.. డీజీపీకి హరీశ్‌రావు సూచన