Harish Rao | హైదరాబాద్ : విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. మాటలే తప్ప చేతలు లేని ముఖ్యమంత్రి నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కావాలి..? ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి..? అని హరీశ్‌రావు నిలదీశారు. వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో అనారోగ్యం పాలై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని లీలావతిని హరీశ్‌రావు పరామర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు. సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారు. మేము ప్రశ్నిస్తే వార్డెన్లు, ప్రిన్సిపల్స్ మీద చర్యలు తీస్కొని చేతులు దులుపుకుంటున్నారు. నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతున్నరు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడం లేదు. ఇప్పటికైనా కళ్లు తెరిచారు స్వాగతిస్తున్నాము. గురుకులాల మొక్కుబడి సందర్శన కాదు.. ఆ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండి. ఫోటోలకు పోజులు ఇవ్వడం కాదు.. పట్టెడు పనికొచ్చే బువ్వ పెట్టి పొట్టలు నింపండి. ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత విద్యార్థులకు సకాలంలో చికిత్స అందించకపోవడం వారి ప్రాణాల మీదకు వస్తున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాలు బలిగొంటున్నాయి అని హరీశ్‌రావు తెలిపారు.
ఇప్పటికైనా కళ్లు తెరవండి.. ప్రచారం కోసం కాదు పిల్లల భవిషత్తు కోసం ఆలోచించండి అని హరీశ్‌రావు కోరారు. చలికాలం వణుకుతున్నారు, వేడి నీళ్ళు లేవు. బట్టలు కూడా వారికి ఇవ్వలేదు, ఆ సమస్యలు పరిష్కరించండి. హాస్టళ్లలో పని చేసే సిబ్బంది జీతాలు ఇవ్వడం లేదు. గ్రీన్ ఛానెల్ ఉంటే ఆరు నెలలుగా హాస్టళ్లకు ఎందుకు డబ్బులు ఇవ్వటం లేదు అని హరీశ్‌రావు అడిగారు.
ఇవి కూడా చదవండి..
Mohan babu | అజ్ఞాతం వార్తలు.. స్పందించిన మోహన్‌బాబు
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం.. గురుకుల విద్యార్థులకు శాపం : హరీశ్‌రావు
Allu Arjun Press Meet | జైలు నుంచి వచ్చాక అల్లు అర్జున్ మరోసారి ప్రెస్ మీట్.. ఏమన్నారంటే.!