Mohan babu | నేను ఎక్కడికీ పారిపోలేదు.. అజ్ఞాతం వార్తలపై స్పందించిన మోహన్‌బాబు
Mohan babu | అజ్ఞాతం వార్తలపై మంచు మోహన్ బాబు (Mohan babu) స్పందించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని.. ఇంట్లోనే వైద్య సంరక్షణలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
Mohan babu | మంచు మోహన్ బాబు (Mohan babu) అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. జర్నలిస్టుపై దాడి ఘటనకు సంబంధించి హత్యాయత్నం కేసులో స్టేట్మెంట్ను రికార్డు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా మోహన్ బాబు కనిపించలేదని సదరు కథనాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో అజ్ఞాతం వార్తలపై మోహన్ బాబు స్పందించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని.. ఇంట్లోనే వైద్య సంరక్షణలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
‘నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా ముందస్తు బెయిల్ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు. నేను ఎక్కడికీ పారిపోలేదు. ప్రస్తుతం ఇంట్లో వైద్య సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలు రాయొద్దని మీడియాను కోరుతున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
False propaganda is being circulated.! Anticipatory bail has NOT been rejected and currently. I am under medical care in my home. I request the media to get the facts right.
— Mohan Babu M (@themohanbabu) December 14, 2024
కాగా, జల్పల్లిలో ఉన్న తన నివాసంలో జర్నలిస్టుపై దాడి ఘటనకు సంబంధించి మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని.. అయితే ఆయన ఎక్కడా కనిపించడం లేదని ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. నిన్నటి నుంచి మోహన్‌బాబు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మోహన్ బాబు అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించిందని.. దీంతో మోహన్ బాబు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి.
మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు..
మంగళవారం రాత్రి జల్పల్లిలో ఉన్న తన నివాసంలో జర్నలిస్టుపై దాడి ఘటనకు సంబంధించి ఆయనపై పహాడీ షరీష్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో మొదట మోహన్ బాబుపై 118(1) బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదయ్యింది. అనంతరం లీగల్ ఒపీనియన్ తీసుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు గురువారం నాడు 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
అయితే ఈ కేసుకు సంబంధించి హైకోర్ట్‌లో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని ఈ పిటిషన్లో పేర్కొన్నాడు. కాగా.. ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారించిన ధర్మాసనం పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా, అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న మోహన్ బాబు అభ్యర్థనను తిరస్కరించింది. అలాగే ఈ పిటిషన్‌కు సంబంధించి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
Also Read..
Mohan babu | అజ్ఞాతంలోకి మంచు మోహన్ బాబు.. పోలీసుల గాలింపు!
“మోహన్‌బాబుకు బెయిల్ నిరాకరణ”
“Mohan Babu | మీడియాపై దాడి.. మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు”
“Mohan Babu | గాయపడ్డ జర్నలిస్ట్‌కు మోహన్‌బాబు క్షమాపణలు.. లేఖ విడుదల”
“Manchu Family Dispute | పోలీసుల జోక్యంతో.. సద్దుమణిగిన ‘మంచు’ పంచాయితీ!”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

