Mohan Babu | మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల (Manchu Family issue) నేపథ్యంలో సినీ నటుడు మంచు మోహన్ బాబు (Mohan Babu) జర్నలిస్ట్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనలో టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆగ్రహించిన జర్నలిస్ట్ సంఘాలు.. మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాడి ఘటనలో గాయపడిన జర్నలిస్ట్‌కు మోహన్‌బాబు ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా బహిరంగ లేఖ విడుదల చేశారు.
కుటుంబ వివాదం ఘర్షణకు దారి తీసినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఓ జర్నలిస్ట్ సోదరుడు గాయపడటం తనకు బాధ కలిగించిందని అన్నారు. ఈ ఘటన తర్వాత అనారోగ్యం కారణంగా 48 గంటల పాటు ఆసుపత్రిలో చేరడంతో వెంటనే స్పందించలేకపోయానని వివరణ ఇచ్చారు. ఆ రోజు తన ఇంటిగేటు విగిరిపోయిందని.. దాదాపు 30 నుంచి 50 మంది వ్యక్తులు ఇంట్లోకి చొచ్చుకొచ్చినట్లు వివరించారు. ఆ సమయంలో సహనాన్ని కోల్పోయినట్లు చెప్పారు. పరిస్థితి అదుపు చేసే క్రమంలో జర్నలిస్ట్‌కు గాయమైందని.. ఇది చాలా దురదృష్టకరమన్నారు. అతడికి, ఆయన కుటుంబానికి కలిగిన బాధకు తాను తీవ్రంగా చింతిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. గాయపడ్డ జర్నలిస్ట్ త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా మోహన్‌బాబు కాంక్షించారు.
— Mohan Babu M (@themohanbabu) December 13, 2024
Also Read..
Mohan Babu | జర్నలిస్ట్ దాడి ఘటనపై స్పందించిన మోహన్ బాబు
Mohan Babu | ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మోహన్ బాబు
Keerthy Suresh | కల్యాణ వేళ.. ఆనంద హేల.. వివాహబంధంలోకి కీర్తి సురేష్.. Photos