Mohan Babu | మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల నేపథ్యంలో సినీ నటుడు మంచు మోహన్ బాబు జర్నలిస్ట్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనలో జర్నలిస్ట్‌కు తీవ్రగాయాలు కాగా.. మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలి అంటూ జర్నలిస్ట్ సంఘాలు అన్నీ ధర్నా చేయడం మొదలు పెట్టాయి. అయితే ఈ క్రమంలోనే నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మోహన్ బాబు మరో ఆడియోను వదిలాడు.
కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? అంటూ మోహన్ బాబు ప్రశ్నించాడు. దీనిపై ప్రజలతో పాటు రాజకీయ నాయకులు ఆలోచించాలి. కుటుంబ సమస్యలు అందరికి ఉంటాయి. మేం నటులం కాబట్టి కొంతమంది ఉన్నవి లేనివి వార్తల్లో చెబుతుంటారు. ఇలా వార్తలు చదివేవారు కూడా ఆలోచించాలి. వారి ఇంట్లో కుటుంబ సమస్యలు వస్తే ఇలానే బయటకు చెబుతున్నారా అని ఆలోచించుకోండి అంటూ మోహన్ బాబు అన్నారు.
పత్రిక విలేకరులు నాలుగు రోజుల నుంచి నా ఇంటి చూట్టే తిరుగుతున్నారు.. ఇది ఎంత వరకు న్యాయం. నా మీద మీడియా ఎంత నెగిటివ్ ప్రచారం చేస్తుందో నాకు తెలుసు. రాత్రి సమయంలో అలా గేట్ పగలగొట్టి ఇంట్లోకి రావడం తప్పే. అందులో ఉంది మీడియానా లేకా ఇంకా ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు. మీడియాను అడ్డుపెట్టుకొని నాపై దాడి చేసే అవకాశం ఉందని ఆలోచించా. చీకట్లో ఘర్షణ జరిగింది. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలింది. అంతేగాని మీడియా వారిపై దాడి చేయాలని దైవసాక్షిగా అనుకోలేదు. అతడికి తగిలిన దెబ్బకు నేను ఇప్పటికి బాధపడుతున్నాను. ఆ సమయంలో నా మోహం మీద కెమెరా పెట్టేవరకు నా కంటికి దెబ్బ తగిలింది. దీంతో ఆవేశంతో మైక్ లాక్కున్నాను. ఈ క్రమంలోనే అతడికి దెబ్బ తగిలింది. ఆ జర్నలిస్ట్ నాకు తమ్ముడి లాంటివాడు. అతని భార్యాబిడ్డలు ఎంత బాధపడుతున్నారో ఆలోచించా. నా బాధ గురించి ఎవరూ ఆలోచించలేదు. నేను సినిమాల్లో నటిస్తాను తప్ప నిజ జీవితంలో నటించాల్సిన అవసరం నాకు లేదు అంటూ మోహన్ బాబు చెప్పుకోచ్చాడు.
గేటు బయట జర్నలిస్టులు ఉండి నేను అసభ్యకరంగా ప్రవర్తించి కొట్టి ఉంటే నాపై 50 కేసులు కాదు 100 కేసులు పెట్టుకోవచ్చు. లేదా అరెస్ట్ చేయవచ్చు. లేకపోతే నేనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆవేశంలో నా ఇంటి బయట ఉన్నవారిని కొట్టాను నన్ను అరెస్ట్ చేయండి అంటూ అరెస్టు అయ్యే వాడిని. నా ఇంట్లోకి వచ్చి నా ఏకాగ్రతను నా మనశ్శాంతిని భగ్నం చేశారు. ఇప్పటికే నా కొడుకు (మనోజ్) నా ప్రశాంతతను చెడగొడుతున్నాడు. అయిన వాడు నా కన్న బిడ్డ.. ఎప్పటికి నేను కన్న బిడ్డే. ఏదో ఒక రోజు ఈ విషయంలో న్యాయం జరుగుతుంది. ఈ విషయంలో అందరం కుర్చుని మాట్లాడుకుంటాం. కుటుంబ సమస్యల్లో మధ్యవర్తులు అవసరం లేదు. కట్టుబట్టలతో మద్రాస్‌కు వెళ్లినవాడిని.. నా కష్టార్జితం ఇదంతా. ఈరోజు కులమతాలకు అతీతంగా 25 శాతం ఫ్రీ ఎడ్యూకేషన్ ఇవ్వడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. ఇవ్వని మర్చిపోయి నేను కొట్టిన విషయం మాట్లాడుతున్నారు. నేను కొట్టింది తప్పు కానీ ఏ సందర్భంలో కొట్టానో ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లో ఇలానే దూరితే ఒప్పుకుంటారా. మీకు టీవీలు ఉన్నాయి మాకు లేవు. నేను కూడా రేపు టీవీ పెట్టవచ్చు. అది కాదు విషయం. నేను జర్నలిస్ట్‌ను కొట్టినందుకు చింతిస్తున్నాను. నేను కొట్టింది వాస్తవమే, అసత్యం కాదు పైన భగవంతుడు చూస్తున్నాడు. అతడే ఇవన్ని చూసుకుంటాడు అంటూ మోహన్ బాబు వెల్లడించారు.
మీడియా వాళ్ళను కొట్టకముందు నమస్కారం పెట్టాను
కొట్టిందే చెప్తున్నారు కానీ నమస్కారం పెట్టింది ఎవరూ చెప్పట్లేదు
వాళ్ళు ఉద్యోగస్తులే నేను కూడా కూలీనే
గాయపడిన వ్యక్తి విషయంలో బాధ పడుతున్నాను https://t.co/QPk2TCLaCZ pic.twitter.com/AFEERft2hV
— Telugu Scribe (@TeluguScribe) December 12, 2024