హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): విలేకరిపై దాడి కేసులో సినీ నటుడు మంచు మోహన్‌బాబుకు చుక్కెదురైంది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. విలేకరిని హత్య చేసేందుకు ప్రయత్నించినట్టు మోహన్‌బాబుపై తీవ్రమైన అభియోగాలు వచ్చినందున బెయిల్ ఇవ్వలేమని జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం స్పష్టం చేశారు.
కౌంటర్ దాఖలు నిమిత్తం ఫిర్యాదుదారు ఎం రంజిత్ కుమార్‌కు నోటీసులు జారీచేసి, తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు.