Mohan babu | మంచు మోహన్ బాబు (Mohan babu) అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలిసింది. జల్పల్లిలో ఉన్న తన నివాసంలో జర్నలిస్టుపై దాడి ఘటనకు సంబంధించి ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన ఎక్కడా కనిపించడం లేదని తెలుస్తోంది. నిన్నటి నుంచి మోహన్‌బాబు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మోహన్ బాబు అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అలాగే ఈ పిటిషన్‌కు సంబంధించి విచారణను గురువారానికి వాయిదా వేసింది. దీంతో మోహన్ బాబు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
మంగళవారం రాత్రి జల్పల్లిలో ఉన్న తన నివాసంలో జర్నలిస్టుపై దాడి ఘటనకు సంబంధించి ఆయనపై పహాడీ షరీష్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో మొదట మోహన్ బాబుపై 118(1) బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదయ్యింది. అనంతరం లీగల్ ఒపీనియన్ తీసుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు గురువారం నాడు 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
అయితే ఈ కేసుకు సంబంధించి హైకోర్ట్‌లో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని ఈ పిటిషన్లో పేర్కొన్నాడు. కాగా.. ఈ పిటిషన్‌ను నేడు విచారించిన ధర్మాసనం పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా, అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న మోహన్ బాబు అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అలాగే ఈ పిటిషన్‌కు సంబంధించి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
Also Read..
“మోహన్‌బాబుకు బెయిల్ నిరాకరణ”
“Mohan Babu | గాయపడ్డ జర్నలిస్ట్‌కు మోహన్‌బాబు క్షమాపణలు.. లేఖ విడుదల”
“Mohan Babu | మీడియాపై దాడి.. మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు”
“Manchu Family Dispute | పోలీసుల జోక్యంతో.. సద్దుమణిగిన ‘మంచు’ పంచాయితీ!”
Allu Arjun | అల్లు అర్జున్ ఇంటికి సినీ ప్రముఖులు.. వీడియోలు
Allu Arjun | అల్లు అర్జున్ను చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగం.. వీడియో
Allu Arjun: చట్టాన్ని గౌరవిస్తా: అల్లు అర్జున్