Allu Arjun | అల్లు అర్జున్ ఇంటికి సినీ ప్రముఖులు.. వీడియోలు
Allu Arjun | అల్లు అర్జున్ (Allu Arjun)ని పరామర్శించేందుకు సినీ సెలబ్రిటీలు అల్లు నివాసానికి చేరుకుంటున్నారు.
Allu Arjun | సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అరెస్టైన టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) చంచల్‌గూడ జైలు నుంచి శనివారం ఉదయం 6.40 గంటలకు విడుదలయ్యారు. జైలు నుంచి ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బన్నిని పరామర్శించేందుకు సినీ సెలబ్రిటీలు అల్లు నివాసానికి చేరుకుంటున్నారు.
స్టార్ నటులు, దర్శకులు, నిర్మాతలు బన్నికి మద్దతు తెలుపుతున్నారు. దర్శకుడు సుకుమార్, దిల్ రాజ్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, మైత్రీ మూవీ మేకర్ నిర్మాతలు, హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, బన్ని వాసు, నిర్మాత ఎస్కేఎన్, రానా దంపతులు, పుష్ప టీమ్ తదితరులు అల్లు నివాసానికి చేరుకొని బన్నిని కలిశారు.
#WATCH | Actor Vijay Deverakonda meets Actor Allu Arjun at the latter’s residence in Jubilee Hills, Hyderabad.
Allu Arjun was released from Chanchalguda Central Jail today after the Telangana High Court granted him interim bail yesterday on a personal bond of Rs 50,000 in… pic.twitter.com/MB2tpytfKL
— ANI (@ANI) December 14, 2024
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో నిన్న చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా, నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ న్యాయవాదులు రూ. 50 వేల పూచీకత్తును జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించారు. అయితే హైకోర్టు నుంచి బెయిల్ పత్రాలు జైలు అధికారులు శుక్రవారం రాత్రి ఆలస్యంగా అందాయి. దీంతో ఆయన రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇవాళ ఉదయం జైలు నుంచి బయటకు వచ్చారు.
#WATCH | Telangana: Visuals from the residence of Actor Allu Arjun at Jubilee Hills in Hyderabad
He was released from Chanchalguda Central Jail today after Telangana High Court granted him interim bail yesterday on a personal bond of Rs 50,000 in connection with the death of… pic.twitter.com/B2ezQSO1Bq
— ANI (@ANI) December 14, 2024
Also Read..
Allu Arjun: చట్టాన్ని గౌరవిస్తా: అల్లు అర్జున్
Allu Arjun | అల్లు అర్జున్ను చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగం.. వీడియో
Allu Arjun: అండర్ ట్రయల్ 7697.. మంజీరా బరాక్‌లో అల్లు అర్జున్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

